Revanth Reddy: రేవంత్ పాదయాత్రకు పూర్తి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
ABN, First Publish Date - 2023-03-06T18:06:11+05:30
రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ (Hath Se Hath Jodo Yatra)కు భద్రత పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ (Hath Se Hath Jodo Yatra)కు భద్రత పెంచాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న న్యాయస్థానం రేవంత్ పాదయాత్రకు పూర్తి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే 69 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరపు న్యాయవ్యాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. కేవలం ట్రాఫిక్ కంట్రోల్ కోసమే పోలీసులను వినియోగిస్తున్నారని రేవంత్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. రాత్రిబసలోనూ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుబంధంగా హాథ్‌సే హాథ్ జోడో యాత్రను టీపీసీసీ చేపట్టింది. ఫిబ్రవరి 6వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే యాత్ర నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాచరికానికి వ్యతిరేకంగా ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. మొత్తం రెండు నెలల పాటు అన్ని నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ప్రతీ ఇంటికి కాంగ్రెస్ స్టిక్కర్ అంటించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే సహజ స్వేచ్ఛను వినియోగించుకుని నేతలు తమదైన శైలిలో వారివారి నియోజకవర్గాల్లో జోడో యాత్రను నిర్వహిస్తున్నారు.
Updated Date - 2023-03-06T18:06:11+05:30 IST