ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఒక్క గదిలో 35 మందిని కుక్కారు.. భోజనమూ బాగాలేదు

ABN, Publish Date - Dec 21 , 2023 | 08:50 AM

నిజాం కళాశాల(Nizam College) విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. సైఫాబాద్‌ పీజీ హాస్టల్‌(Saifabad PG Hostel)లో

- రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థినులు

- పోలీసులతో వాగ్వాదం

బర్కత్‌పుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): నిజాం కళాశాల(Nizam College) విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. సైఫాబాద్‌ పీజీ హాస్టల్‌(Saifabad PG Hostel)లో మౌలిక సదుపాయాలు లేవని, భోజనం సరిగా పెట్టడం లేదని, ఒక్కో గదిలో 35మందిని కుక్కుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద నడిరోడ్డుపై బైఠాయించారు. కళాశాల ప్రిన్సిపాల్‌, వర్శిటీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాలికలకు మద్దతుగా బాలురు కూడా రోడ్డుపై బైఠాయించారు. దీంతో బషీర్‌బాగ్‌లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అబిడ్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ డి.శ్రీనివాస్‌ జోక్యం చేసుకొని ప్రిన్సిపాల్‌ను ఒప్పించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

ఈ సందర్భంగా నిజాం కళాశాలలో పీజీ సైన్స్‌ విద్యార్థులు మాట్లాడుతూ సైఫాబాద్‌లోని హాస్టల్‌లో తమకు రెండు గదులు కేటాయించారని, ఒక్కో గదిలో 35 మందిని ఉంచారని ఆరోపించారు. బాత్‌రూంలు సైతం సరిగా లేవని, తాగునీరు అందుబాటులో ఉండడం లేదని వాపోయారు. భోజనం సరిగా చేయడం లేదని, ఉదయం తయారు చేసిన టిఫిన్‌నే సాయంత్రం కూడా వడ్డిస్తున్నారని, చట్నీలు పాడైనా బలవంతంగా తినాల్సి వస్తోందని వారు ఆరోపించారు. తాము రోజుకు ఒక్కపూట కూడా కడుపునిండా భోజనం చేయలేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బెడ్‌మీద ఎనిమిది మంది పడుకునే పరిస్థితి ఉందన్నారు. తమకు ఈ హాస్టల్‌ వద్దని ఉస్మానియా వర్సిటీలోని బాలికల హాస్టల్‌ కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. తాము నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌కు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బీమా మాట్లాడుతూ.. విద్యార్థుల హాస్టల్‌ సమస్య రెండు రోజుల్లో పరిష్కారం అవుతుందని, 24మంది బాలికలను సైఫాబాద్‌ హాస్టల్‌ నుంచి ఉస్మానియా బాలికల హాస్టల్‌కు పంపుతున్నామని తెలిపారు. భోజనం నీటి వసతి కల్పిస్తున్నామని ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. నిజాం కళాశాలలోని పీజీ విద్యార్థులలో సైన్స్‌ విద్యార్థులను సైఫాబాద్‌ హాస్టల్‌కు, ఆర్ట్స్‌, కామర్స్‌ విద్యార్థులను సికింద్రాబాద్‌ పీజీ కళాశాల హాస్టల్‌కు కేటాయించామని ఆయన తెలిపారు.

Updated Date - Dec 21 , 2023 | 08:50 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising