ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఆ రోజు ఫ్లైఓవర్లు బంద్‌.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Dec 28 , 2023 | 11:23 AM

31న రాత్రి నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా... సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Cyberabad Traffic Police) ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని పరిమితులు, మార్గదర్శకాలను జారీ చేసినట్లు ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు.

- న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా..

- ఓఆర్‌ఆర్‌పై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకే అనుమతి

- పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పైనా ఇతర కార్లకు నో ఎంట్రీ

- నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): 31న రాత్రి నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా... సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు(Cyberabad Traffic Police) ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని పరిమితులు, మార్గదర్శకాలను జారీ చేసినట్లు ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు. ఆంక్షలు డిసెంబర్‌ 31న రాత్రి నుంచి మర్నాడు తెల్లవారుజాము వరకు అమల్లో ఉంటాయని, ఆ మేరకు వాహనదారులు తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.

రోడ్డు మార్గాల మూసివేత

- నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్‌ మోటార్‌ వాహనాలకు అనుమతి ఉండదు.

- పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్ వే పై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి లేదు.

- రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌, గచ్చిబౌలి ఫ్లైఓవర్‌, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు (1, 2) షేక్‌ పేట్‌ ఫ్లైఓవర్‌, మైండ్‌ స్పేస్‌ ఫ్లైఓవర్‌, రోడ్‌ నెం.45 ఫ్లైఓవర్‌, దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జ్‌, సైబర్‌ టవర్‌ ఫ్లైఓవర్‌, ఫోరమ్‌ మాల్‌-జేఎన్‌టీయూ ఫ్లైఓవర్‌, ఖైత్లాపూర్‌ ఫ్లైఓవర్‌, బాబూజగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్‌, (బాలానగర్‌)లు పూర్తిగా మూసి ఉంటాయి.

- క్యాబ్‌లు/టాక్సీ/ఆటో రిక్షా ఆపరేటర్లు(కాంట్రాక్ట్‌ క్యారేజీలు) డ్రైవర్లు కచ్ఛితంగా యూనిఫామ్‌ ధరించాలి. అన్ని డాక్యుమెంట్స్‌ సిద్ధంగా ఉంచుకోవాలి.

- క్యాబ్‌ డ్రైవర్లు ఎలాంటి పరిస్థితుల్లోనూ రైడ్‌ నిరాకరించకూడదు. అలాంటి డ్రైవర్లపై మోటారు వాహనాల చట్టం కింద రూ. 500జరిమానా విధిస్తారు. డ్రైవర్‌ నిరాకరిస్తే బండి నెంబర్‌, సమయం, ప్రదేశం వివరాలతో వాట్సాప్‌ 9490617346కు ఫిర్యాదు చేయాలి.

- ప్రజలతో అనుచితంగా ప్రవర్తించకూడదు. అదనపు చార్జీలు డిమాండ్‌ చేయకూడదు.

- బార్‌/పబ్‌/క్లబ్‌ల నిర్వాహకులు తమ ప్రాంగణంలో మద్యం తాగిన కస్టమర్లు/అసోసియేట్లు వాహనాలను డ్రైవ్‌ చేసేందుకు అనుమతించరాదు. ఆ విషయంలో వారు పట్టించుకోకుంటే.. సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుంటారు. మద్యం తాగిన వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాలి.

- ఓవర్‌ స్పీడ్‌, రాంగ్‌రూట్‌, సిగ్నల్‌ జంప్‌, ర్యాష్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారిని గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలు సిద్ధం

- 31న రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్‌ పరిధిలోని అన్ని రహదారులపై డ్రంకెన్‌ డ్రైవ్‌ విస్తృత తనిఖీలు నిర్వహిస్తారు.

- సరైన పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా పోలీస్‌ అధికారులు కస్టడీలోకి తీసుకుంటారు.

- చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా, లేదా మైనర్‌ డ్రైవింగ్‌ చేస్తే వాహనాన్ని సీజ్‌ చేస్తారు. వాహన యజమాని, డ్రైవర్‌ ఇద్దరినీ కోర్టులో హాజరు పరుస్తారు.

- వాహనాలలో అధిక-డెసిబెల్‌ సౌండ్‌/మ్యూజిక్‌ సిస్టమ్‌ను ఉపయోగించడం నిషేధం.

- నంబరు ప్లేట్లు లేని వాహనాలు నడిపితే, ఆ వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.

- వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం/వాహనాల పై భాగంలో ప్రయాణించడం/బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.

- ర్యాష్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, మితిమీరిన శబ్దాలు, ప్రమాదకరమైన డ్రైవింగ్‌, తదితర వాటిపై ఎప్పటికప్పుడు కేసులు బుక్‌ చేసి చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.

Updated Date - Dec 28 , 2023 | 11:23 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising