ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, First Publish Date - 2023-12-07T08:22:08+05:30

రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం సందర్భంగా.. గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రమాణ స్వీకారం సందర్భంగా.. గురువారం ఎల్‌బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు(CP Sudhir Babu) ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు.. పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, అధికారులు పెద్దఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని అడిషనల్‌ సీపీ వెల్లడించారు.

- ఏఆర్‌ పెట్రోల్‌ పంపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం వైపు వెళ్లకుండా నాంపల్లి, చాపల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

- ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్‌ సర్కిల్‌ వైపు వెళ్లకుండా.. ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

- బషీర్‌బాగ్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను బషీర్‌బాగ్‌ వద్ద కింగ్‌కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రహదారి వైపు మళ్లిస్తారు.

-ఫ సుజాత సర్కిల్‌ లేన్‌ నుంచి ఖాన్‌ లతీ్‌ఫఖాన్‌ భవనం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. సుజాతస్కూల్‌ జంక్షన్‌ వద్ద నాంపల్లి రోడ్డు వైపు మళ్లిస్తారు.

- వాహనదారులు ఎల్‌బీ స్టేడియం సమీపంలో ఉన్న పలు జంక్షన్‌ల వైపు వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకోవాలని ట్రాఫిక్‌

పోలీసులు సూచించారు.

- పంజాగుట్ట, వీవీ విగ్రహం, రాజీవ్‌గాంధీ విగ్రహం, నిరంకారి, పాత సైఫాబాద్‌, లక్డీకాపూల్‌, ఇక్బాల్‌ మినార్‌, రవీంద్రభారతి, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ కాంప్లెక్స్‌, బషీర్‌బాగ్‌, బీజేఆర్‌ విగ్రహం, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, ఆబిడ్స్‌ సర్కిల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌, నాంపల్లి, కేఎల్‌కే బిల్దింగ్‌, లిబర్టీ, హిమాయత్‌నగర్‌, అసెంబ్లీ, ఏంజే మార్కెట్‌, హైదర్‌గూడ ఆయా ప్రాంతాల నుంచి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు పోలీసుల సూచన మేరకు దారి మళ్లింపులు పాటించాలని అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-07T08:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising