కూకట్‌పల్లిలో అనుమానం రేకెత్తిస్తున్న 3 బస్సుల దగ్ధం..

ABN, First Publish Date - 2023-02-13T08:51:04+05:30

కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను పార్కింగ్ చేస్తూ ఉంటారు.

కూకట్‌పల్లిలో అనుమానం రేకెత్తిస్తున్న 3 బస్సుల దగ్ధం..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో పార్కింగ్ చేసిన మూడు బస్సులు దగ్ధమయ్యాయి. కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను పార్కింగ్ చేస్తూ ఉంటారు. అయితే నేడు వాటిలో మూడు బస్సులకు నిప్పంటుకుంది. అక్కడే ఉన్న ట్రావెల్స్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మరో నాలుగు బస్సును పక్కకు తీసుకెళ్లారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఎవరైనా నిప్పుటించారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-13T08:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising