ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jayaprada : జయప్రదకు ఆరు నెలల జైలు.. రూ.5 వేలు జరిమానా.. అసలు కేసు ఏంటంటే..

ABN, First Publish Date - 2023-08-11T13:23:15+05:30

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఒక సినిమా థియేటర్ ఉంది. దానిని చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి నడిపించారు.

చెన్నై : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు జైలు శిక్షను విధిస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు తీర్పును వెలువరించింది. అసలేం జరిగిందంటే.. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఒక సినిమా థియేటర్ ఉంది. దానిని చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి నడిపించారు. అయితే ఈ సినిమా థియేటర్‌లో పని చేస్తున్న కార్మికుల నుంచి ఈఎస్‌ఐ మొత్తాన్ని చెల్లించకుండా ఎగ్గొట్టారు. దీంతో కార్మికులు ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే కార్మికులకు చెల్లించాల్సిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లిస్తానని.. కాబట్టి పిటిషన్‌ను కొట్టివేయాలని ఎగ్మోర్ కోర్టును జయప్రద కోరారు. దీనికి లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. దీంతో కేసుపై విచారణ జరిపిన ఎగ్మోర్ కోర్టు జయప్రదతో పాటు మరో ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. అలాగే.. రూ.5 వేలు జరిమానాను విధించింది.

Updated Date - 2023-08-11T13:23:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising