ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Leakage: నేడు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌పై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-03-21T09:20:43+05:30

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ (TSPSC Leakage) పేపర్ లీకేజీ వ్యవహారంపై ఈరోజు హైకోర్టు (Telangana High Court) లో విచారణ జరుగనుంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జ్‌తో విచారించాలని పిటిషన్ దాఖలైంది. అభ్యర్థులతో పాటు ఎన్ఎస్‌యుఐ (NSUI) పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ల తరుపున వాదించేందుకు నేషనల్ ఎన్‌ఎస్‌యూఐ లీగల్ ఇంఛార్జి వికాస్ దన్కే (National NSUI Legal Incharge Vikas Danke) ఢిల్లీ నుంచి రానున్నారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసేలా ఉందని పిటిషనర్లు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) పీఏ తిరుపతి హస్తముందని పిటిషనర్లు ఆరోపించారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత మరో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని సుచరిత కోరారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించనుంది.

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిలో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో మీరంటే మీరే కారణమంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సిట్ కాదు.. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉంటే పేపర్ లీకేజీలో ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేతలు రేవంత్, బండి సంజయ్‌లకు సిట్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. పేపర్ లీకేజీ వ్యవహారం ఎటువైపు వెళ్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-03-21T09:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising