ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Azadi Ka Amrit Mahotsav: దేశభక్తిని రగిల్చిన షహీద్ భగత్ సింగ్‌

ABN, First Publish Date - 2023-03-06T18:44:15+05:30

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశభక్తుల పోరాటాలపై రూపొందించిన....

Shaheed Bhagat Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) 2వ దశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) “సాంస్కృతిక ఔన్నత్యం” అనే అంశంపై సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది.

షహీద్ భగత్ సింగ్ (Shaheed Bhagat Singh) వీరోచిత పోరాటాలపై నాటకాన్ని ప్రదర్శించారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశభక్తుల పోరాటాలపై రూపొందించిన ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన మహిషాసుర మర్దిని (Mahisasura Mardini) కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

రైల్వేశాఖ తొమ్మిది విభిన్న అంశాలపై దృష్టి సారించి ఏడాది పొడవునా దేశ స్వాతంత్ర్య పోరాట వారసత్వాన్ని గౌరవించే విధంగా రైల్వే శాఖ వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన దక్షిణ మధ్య రైల్వే కళాకారులను అభినందించారు. దేశ స్వాతంత్ర్య పోరాటం( Indian Freedom Movement)లో షహీద్ భగత్ సింగ్ చేసిన వీరోచిత పోరాటం మరో మారు స్మరించుకునేలా చేసిందన్నారు. సుసంపన్నమైన సంస్కృతిని పరిరక్షించి, వాటి ప్రాముఖ్యతను రాబోయే తరాలకు కూడా తెలియజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ రాజీవ్ కిషోర్, కే. పద్మజ, చీఫ్ కమర్షియల్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-06T19:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising