Alert: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 9వ తేదీ నుంచి రెండు రోజులు నీళ్లు బంద్
ABN, First Publish Date - 2023-03-07T12:06:57+05:30
హైదరాబాద్(Hyderabad) రానున్న కొన్ని గంటల్లో నీటిసరఫరా(Water Supply) నిలిచిపోనుంది. ఈనెల 9నుంచి రెండు రోజులపాటు నగరంలో నీటిసరఫరా బంద్ కానుంది. నగరానికి గోదావరి నీల్లు సప్లయ్ చేసే పైపులైన్..
హైదరాబాద్ సిటీ,(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్(Hyderabad) రానున్న కొన్ని గంటల్లో నీటిసరఫరా(Water Supply) నిలిచిపోనుంది. ఈనెల 9నుంచి రెండు రోజులపాటు నగరంలో నీటిసరఫరా బంద్ కానుంది. నగరానికి గోదావరి నీల్లు సప్లయ్ చేసే పైపులైన్ మరమ్మతు పనులు జరుగుతున్నందున..9న ఉదయం 6 గంటల నుంచి 11 ఉదయం 6 గంటల వరకు 48 గంటలపాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు హైదరాబాద్ మెట్రో వాటర్ సివరేజ్ బోర్డు(HMWS) ప్రకటించింది. నగరానికి గోదావరి జలాలను తీసుకొచ్చే ఫేజ్-1లోని 3000 డయా మెయిన్ పైపులైన్ మరమ్మతు పనులు సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద జరగుతుండటంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
ఖైరతాబాద్(Khairatabad)లోని వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో సోమవారం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హోలీ నేపథ్యంలో ఇళ్లల్లో పెద్దఎత్తున నీటి వినియోగం ఉండడం, మరుసటి రోజు నుంచే సరఫరా నిలిపివేస్తే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి పైపులైన్ మరమ్మతు పనులను 24 గంటల పాటు వాయిదా వేశామన్నారు. పైపులైన్ పనుల కారణంగా ఈనెల 9 ఉదయం 6 నుంచి 11 ఉదయం 6 వరకు 48 గంటల పాటు నగరానికి గోదావరి జలాల సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా 24 గంటలూ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తొలుత ఈనెల 8 నుంచే మరమ్మతు పనులు చేయాలని నిర్ణయించారు.
అసలే ఎండాకాలం.. అప్పుడే ఎండ తీవ్రత కూడా పెరుగుతోంది. నీళ్లను పొదుపుగా వాడుకుంటే మంచిది. ఇష్టానుసారంగా నీటిని వృధా చేస్తే కష్టాల ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే.. జరభద్రంగా నీటిని వాడుకుంటే మనకే మంచిది.
సరఫరా నిలిచిపోనున్న ప్రాంతాలు
షాపూర్‌నగర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, జగద్గిరిగుట్ట, గాజులరామారం, సూరారం, డిఫెన్స్‌కాలనీ, నాగారం, దమ్మాయిగూడ, కీసర, రింగ్ మెయిన్-3 ఆన్‌లైన్ సప్లయ్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కాప్రా మున్సిపాలిటీ పరిధితో పాటు ఆర్‌డబ్య్లూఎస్ ఆఫ్ టేక్ ప్రాంతాలైనా కొండపాక (జనగామ, సిద్దిపేట), ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్‌పూర్ (మేడ్చల్/శామీర్‌పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది.
బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్ రిజర్వాయర్ ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, ఎల్లారెడ్డిగూడ, యూసు్‌ఫగూడ, కేపీహెచ్‌బీ, మలేషియన్ టౌన్‌షిప్ రిజర్వాయర్ ప్రాంతాలు, లింగంపల్లి నుంచి కొండాపూర్ వరకు గల ప్రాంతాలు, గోపాల్‌నగర్, మయూర్‌నగర్, నిజాంపేట్/బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లో పాక్షికంగా అంతరాయం తలెత్తనుంది.
Updated Date - 2023-03-07T12:06:57+05:30 IST