ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Highcourt: దర్శకుడు ఎన్.శంకర్‌కు భూకేటాయింపుపై హైకోర్టులో వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వ్

ABN, First Publish Date - 2023-07-05T12:50:22+05:30

దర్శకుడు ఎన్.శంకర్‌కు మోకిళ్లలో ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. దర్శకుడు ఎన్‌.శంకర్‌కు శంకర్‌పల్లిలోని మోకిల్లాలో ఎకరాకు ఐదు లక్షల చెప్పున ఐదు ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన జె.శంకర్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దర్శకుడు ఎన్.శంకర్‌కు (Director N Shankar) మోకిళ్లలో ఐదు ఎకరాల భూమిని కేటాయించడంపై బుధవారం హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. దర్శకుడు ఎన్‌.శంకర్‌కు శంకర్‌పల్లిలోని మోకిళ్లలో ఎకరాకు ఐదు లక్షల చెప్పున ఐదు ఎకరాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన జె.శంకర్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అయితే కోట్ల విలువైన భూమిని ఎకరానికి రూ.5 లక్షలకే కేటాయించారంటూ పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఇక్కడ స్టూడియోలు పెట్టడం వలన బాలీవుడ్ కళాకారులు కూడా వస్తూ ఉంటారని శంకర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. చాలా మందికి ఉపాధి అవకాశం ఉంటుందన్నారు. ఎఫ్‌డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్‌కు ఉంటుందని ఏజీ తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్‌కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. శంకర్ నాలుగు దశాబ్దాల నుంచి సినీ పరిశ్రమ కోసం పనిచేస్తున్నారని.. ఉద్యమంలో ఉన్నారని.. బీసీ కులానికి చెందిన వ్యక్తి అని కోర్టుకు తెలియజేశారు. ఈ పిటిషన్ వేసిన పిటిషనర్ సారం లేని ఆరోపణలతో కోర్టుకు మెట్లు ఎక్కారని శంకర్ తరపు న్యాయవాది తెలిపారు.

వాదనలు విన్న హైకోర్టు... భూపెన్ హాజరే, సత్య జీత్ రేలను వాళ్ళ సొంత రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాయని తెలిపింది. వాళ్ళు తమ రాష్ట్ర వాసులు కావడం తమకు గర్వ కారణం అని భావించాయని.. ఇందులో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. క్రీడాకారులు, కళాకారులకు, స్టూడియోల కోసం ప్రభుత్వాలు భూములు ఇచ్చారని హైకోర్టు గుర్తుచేసింది. శంకర్‌కు సినీ రంగంలో ప్రత్యేక నైపుణ్యం ఉందని... సినీ పరిశ్రమ హైదరాబాద్‌లో స్థిరడాలంటే నిపుణుల అవసరం ఉందని.. అందుకే ప్రభుత్వం శంకర్‌కు భూమిని కేటాయించిందని.. అది కూడా న్యాయమైన రేటు వసూలు చేశాకే భూమి ఇచ్చిందని శంకర్ తరపు న్యాయవాది వాదించారు. చాలా మంది క్రీడాకారులు, దేశానికి బంగారు పతకాలు తెచ్చినప్పుడు ప్రభుత్వాలు భూములు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. అయితే శంకర్‌ను కావాలంటే సినీ అభివృద్ధి కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమమించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. భూమి కేటాయించడం సరైంది కాదని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. తాము ప్రభుత్వానికి సలహాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దర్శకుడు ఎన్.శంకర్‌కు భూకేటాయింపుపై వాదనలు పూర్తి అవగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ నెల 7న తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-07-05T12:50:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising