ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ABN: ఏబీఎన్ వాహనంపై దాడికి యత్నించిన అవినాష్ అనుచరులు

ABN, First Publish Date - 2023-04-17T15:33:11+05:30

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) వాహనంపై ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరులు దాడికి యత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy) వాహనంపై ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరులు దాడికి యత్నించారు. కవరేజ్ చేస్తున్న ఏబీఎన్ ప్రతినిధుల వాహనాన్ని అవినాశ్‌ అనుచరులు అడ్డుకుని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై అక్కసు వెళ్లగక్కారు. బూతులు తిడుతూ ఏబీఎన్ వాహనంపై దాడికి యత్నించారు.

సోమవారం ఉదయం నుంచి ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన ఏపీసోడ్‌ను ఏబీఎన్ ప్రతినిధులు కవరేజ్ చేస్తున్నారు. ఏబీఎన్ ప్రతినిధులు అవినాష్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా ఆయన మాట్లాడలేదు. అవినాష్ ఇంటి నుంచి బయలుదేరగా.. ఖైరతాబాద్ సెంటర్ వద్ద సిగ్నల్ పడడంతో ఆయన కాన్వాయ్ ఆగిపోయింది. అక్కడ ఏబీఎన్ ప్రతినిధులు అవినాష్‌కు సంబంధించిన విజువల్స్ తీస్తున్నారు. ఆ సమయంలో అవినాష్ అనుచరులు ఏబీఎన్ వాహనం వద్దకు వచ్చి బూతులు తిడుతూ కెమెరామెన్‌పై దాడి చేశారు. కెమెరాను కిందపడేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడున్న పోలీసులు వారిని వారించినా వినలేదు. కొన్ని మీడియా చానల్స్ కూడా ఫాలో అవుతున్నాయని.. వాటిని వదిలేసి ఏబీఎన్ వాహనం వద్దకు వచ్చి మీకు ఇంత ఇంటరెస్టు ఎందుకని బూతులు తిడుతూ రాలేని విధంగా దుర్భాషలాడారు.

వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మొదటినుంచి నిజాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. దీనిని తట్టుకోలేని అవినాష్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ కేసు కోర్టులో ఉందని, న్యాయస్థానం చూసుకుంటుందని, ఏబీఎన్‌కు ఏం అవసరం.. ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ అవినాష్ అనుచరులు రెచ్చిపోయారు.

Updated Date - 2023-04-17T15:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising