ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Azharuddin : ముందస్తు బెయిల్ కోసం మల్కాజ్‌గిరి కోర్టుని ఆశ్రయించిన అజారుద్దీన్

ABN, First Publish Date - 2023-10-27T22:45:56+05:30

HCAలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మల్కాజ్‌గిరి కోర్టుని HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ( Azharuddin ) ఆశ్రయించారు.

హైదరాబాద్: HCAలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మల్కాజ్‌గిరి కోర్టుని HCA మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ ( Azharuddin ) ఆశ్రయించారు. టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు నమోదు అయింది. అజారుద్దీన్‌పై జస్టిస్ లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ 4 కేసులు పెట్టింది. 2020 నుంచి 2023 వరకు HCAలో కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసారని ఫారెన్సిక్ నివేదిక తెలిపింది. ఆగస్ట్ 10వ తేదీన HCA నిధులపై జస్టిస్ లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో భారీ గొల్‌మాల్ చేసినట్లు గుర్తించింది. ఒక్కో బాల్‌ను 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించింది. క్రికెట్ బాల్స్ కొనుగోలు పేరుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు 57 లక్షలు నష్టం జరిగినట్లు లావ్ నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్‌లో తెలింది. బకెట్ చైర్స్ కొనుగోలులో కూడా HCAకు 43 లక్షలు నష్టం వాటిల్లినట్లు కమిటీ రిపోర్టులో పేర్కొంది.ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరుతో 1.50 కోట్లు HCAకు నష్టం వచ్చింది. జిమ్ పరికరాల పేరుతో 1.53 కోట్లు నష్టం వాటిల్లింది. అజారుద్దీన్‌పై ఉప్పల్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి అజారుద్దీన్. అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఉప్పల్‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో అజారుద్దీన్ పిటిషన్ వేశారు. నవంబర్ 1వ తేదీన బెయిల్ పిటిషన్‌పై మల్కాజ్‌గిరి కోర్టు విచారణ చేపట్టనున్నది.

Updated Date - 2023-10-27T22:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising