ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: పంచాయ‌తీల్లో బిల్లుల పెండింగ్..

ABN, First Publish Date - 2023-06-01T15:43:39+05:30

తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహాంచాలనుకున్న ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడంలేదు. మే 23న పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న రూ. 12 వందల కోట్ల బిల్లులను క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది వేడుకలను (Telangana Decade Celebrations) ఘనంగా నిర్వహాంచాలనుకున్న ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడంలేదు. మే 23న పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న రూ. 12 వందల కోట్ల బిల్లులను (12 Hundred Crore Bills) క్లియర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) సంబరాలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటన చేసి 10 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు సర్పంచ్‌లకు నిధులు అందలేదు. చాలా చోట్ల ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేశారు.

పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఇప్పటి వరకు విడతలవారీగా చెల్లిస్తున్నామని సంబంధిత శాఖ మంత్రి చెబుతున్నా.. అది ఎక్కడా అమలు కావడంలేదు. ఒక్కో గ్రామ పంచాయతీలో రూ. 10 నుంచి 50 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని గ్రామాలకు కొంతమేర మాత్రమే నిధులు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఇక రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జూన్ 2న రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను వైభంగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. 21 రోజుల పాటు ఉత్సవాలు జరపాలని.. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Updated Date - 2023-06-01T15:43:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising