TS News: ఫ్లోర్ లీడర్ ఎంపికపై బీజేపీ కసరత్తు! ఆ ఇద్దరిలో ఎవరికిస్తారన్న దానిపై ఉత్కంఠ
ABN, First Publish Date - 2023-07-31T15:46:47+05:30
ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ బీజేపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏడాది నుంచి శాసనసభలో ఖాళీగా ఉన్న ఫ్లోర్ లీడర్ పదవిని ఇప్పటి వరకూ కమలనాథులు భర్తీ చేయలేదు. దీంతో ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై ఆ పార్టీలో ఉత్కంఠ సాగుతోంది.
హైదరాబాద్: ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ బీజేపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏడాది నుంచి శాసనసభలో ఖాళీగా ఉన్న ఫ్లోర్ లీడర్ పదవిని ఇప్పటి వరకూ కమలనాథులు భర్తీ చేయలేదు. దీంతో ఫ్లోర్ లీడర్ ఎవరనే దానిపై ఆ పార్టీలో ఉత్కంఠ సాగుతోంది. ఏడాది క్రితం వరకు బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. గతేడాది ఆగస్టు 23న రాజాసింగ్‌ను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో ఏడాది కాలంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగా ఉంది.
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలుగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు ఉన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరో తెలియదంటూ మంత్రి కేటీఆర్ సభలో కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. రేసులో ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవిని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ నియామకంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించింది. కొత్త అధ్యక్షుడి రాకతో ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికి అప్పగిస్తారన్న దానిపై ఆసక్తి రేపుతోంది. ఈ శాసనసభ సమావేశాలకే నియమిస్తారా? లేదంటే ఇంకో మూడు నెలల్లో సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టే అప్పటివరకూ పెండింగ్‌లో పెట్టేస్తారో వేచి చూడాలి.
Updated Date - 2023-07-31T15:46:47+05:30 IST