ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS VS BJP: సోదాలకు ముందు.. ఆ తర్వాత

ABN, First Publish Date - 2023-03-12T03:22:39+05:30

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరైన నేపథ్యంలో మరోసారి ఫ్లెక్సీవార్‌కు తెరలేచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బీజేపీపై బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీవార్‌!

హైదరాబాద్‌లో ఏర్పాటు

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరైన నేపథ్యంలో మరోసారి ఫ్లెక్సీవార్‌కు తెరలేచింది. విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్న దాడులను విమర్శిస్తూ హైదరాబాద్‌లో శనివారం ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుత కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యసింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పశ్చిమ బెంగాల్‌ బీజేపీ పక్ష నేత సువేందు అధికారి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్‌ రాణే సహా పలువురి ఫొటోలను ఫ్లెక్సీలపై ముద్రించారు. అవినీతి మరకలు అంటుకున్న ఈ నేతలంతా సోదాలు(రెయిడ్స్‌) జరగ్గానే కాషాయంలోకి(బీజేపీలోకి) మారారని చూపించేలా చిత్రాలు ముద్రించారు.

మరోపక్క, ఎలాంటి మరకలేని కవిత సోదాలు జరిగిన తర్వాత కూడా మచ్చ లేకుండా ఉన్నారని సూచించేలా ఫ్లెక్సీని రూపొందించారు. ‘అసలైన రంగు ఎప్పటికీ పోదు’ అనే క్యాప్షన్‌ను కవిత చిత్రం పక్కన రాశారు. అంతేకాక, బై బై మోదీ అంటూ హాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇక, డెస్ట్రాయర్‌ ఆఫ్‌ డెమొక్రసీ, గ్రాండ్‌ఫాదర్‌ ఆఫ్‌ హిపోక్రసీ పేరిట ముద్రించిన ఫ్లెక్సీలు కూడా నగరంలో దర్శనమిచ్చాయి. రావణాసురుడి పది తలల్లో మధ్యలో ప్రధాని మోదీ తలను ఉంచారు. మిగిలిన వాటిల్లో ఈడీ, ఈసీ, సీబీఐ, డీఆర్‌ఐ. ఎన్‌ఐఏ, ఐబీ లాంటి సంస్థల పేర్లను రాశారు. ఈ ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్‌ వర్గాలే ఏర్పాటు చేశాయనే చర్చ జరుగుతుంది.

Updated Date - 2023-03-12T03:22:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising