ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: బీఆర్ఎస్‌కు ఝలక్.. బీజేపీలోకి ఎమ్మెల్యే..!!

ABN, First Publish Date - 2023-11-01T12:28:22+05:30

రెండ్రోజుల్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. కాంగ్రెస్, బీజేపీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను

హైదరాబాద్: రెండ్రోజుల్లో తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. కాంగ్రెస్, బీజేపీ మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇంకోవైపు ప్రధాన పార్టీ లీడర్లంతా ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. మరోవైపు టికెట్లు రాక భంగపడ్డ నేతలంతా ఆయా పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు.

తాజాగా ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కూడా జంప్ అయిపోతున్నారు. ఈసారి ఆయనకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఉప్పల్‌లో కాంగ్రెస్ మరొక అభ్యర్థిని ప్రకటించేసింది. దీంతో ఆయన కమలం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే ఉప్పల్‌ బీజేపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరాక.. ఉప్పల్ బీజేపీ అభ్యర్థిగా భేతిని ప్రకటిస్తారా? లేదంటే ఏదైనా హామీ ఇస్తుందో వేచి చూడాలి. నామినేషన్ల గడువు ముగిసేనాటికి తెలంగాణలో ఇంకెన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.

Updated Date - 2023-11-01T12:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising