Tragic Incident: పాపం.. ఇలా కొడుకు ప్రాణం పోతుందని ఆ అమ్మానాన్నకు మాత్రం ఏం తెలుసు..!
ABN, First Publish Date - 2023-09-08T16:19:42+05:30
దాగుడు మూతల ఆట బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన సూరారం రాజీవ్‌గృహకల్పలో జరిగింది. సీఐ వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కనిగిరికి చెందిన కనకరత్నం మరియమ్మ దంపతులు ఆరు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు.
ప్రాణం తీసిన దాగుడు మూతలు
కళ్లకు గంతలు కట్టుకుని భవనంపై ఆడుతూ..
జారిపడి బాలుడి మృతి
గాజులరామారం (ఆంధ్రజ్యోతి): దాగుడు మూతల ఆట బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన సూరారం రాజీవ్‌గృహకల్పలో జరిగింది. సీఐ వెంకటేశ్వరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కనిగిరికి చెందిన కనకరత్నం మరియమ్మ దంపతులు ఆరు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. సూరారం రాజీవ్ గృహకల్పలోని 29వ బ్లాక్, 3వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి కుమారుడు తులసీనాథ్(10) సమీపంలోని ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు.
గురువారం శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్దనే 3వ అంతస్తు పైభాగంలో తోటి స్నేహితుడితో కళ్లకు గంతలు కట్టుకుని దాగుడు మూతల ఆట ఆడుతున్నారు. ప్రహరీ లేకపోవడంతో ప్రమాదవ శాత్తు తులసీనాథ్ కాలు జారి కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2023-09-08T16:20:00+05:30 IST