ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: బీజేపీ తొలి జాబితా విడుదలపై కొనసాగుతోన్న సందిగ్ధత

ABN, First Publish Date - 2023-10-22T08:29:35+05:30

హైదరాబాద్: బీజేపీ తొలి జాబితా విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. మొదటి జాబితాపై ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లు తెలియవచ్చింది. కీలక నేతలు అలకపూనడంతో మొదటి జాబితా విడుదల ఆగినట్లు సమాచారం.

హైదరాబాద్: బీజేపీ తొలి జాబితా విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది. మొదటి జాబితాపై ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లు తెలియవచ్చింది. కీలక నేతలు అలకపూనడంతో మొదటి జాబితా విడుదల ఆగినట్లు సమాచారం. తమకు కేటాయించిన నియోజకవర్గాలను పలువురు సీనియర్లు మర్చమంటున్నారు. దీంతో కీలకనేతలు అడిగిన స్థానాలను అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. ఈ క్రమంలో ఆఖరిక్షణంలో మొదటి జాబితా విడుదల నిలిచిపోయింది. సీనియర్లను ఇంచార్జ్‌లు జవడేకర్, సునీల్ బన్సల్ బుజ్జిగిస్తున్నారు. అభ్యంతరం లేని నియోజకవర్గ నేతలకు నేరుగా ఫోన్లు చేసి టికెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సీనియర్లు దారికొస్తే.. ఏ క్షణమైనా బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది.

కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆరుగురు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. టికెట్ కన్ఫర్మ్ అయిన నేతలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. ఆ అభ్యర్థులు... బోథ్ -సోయం బాపురావు, నిర్మల్ -ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ -రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ -పాయల్ శంకర్, సిర్పూర్ -పాల్వాయి హరీష్ బాబు, బెల్లం పల్లి - అమరాజుల శ్రీదేవి.

Updated Date - 2023-10-22T08:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising