ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Election: కాంగ్రెస్ రెండో జాబితా ఎంపిక కత్తి మీద సామేనా..!

ABN, First Publish Date - 2023-10-24T14:24:51+05:30

ఇక నాలుగు సీట్లను వామపక్షాలకు కాంగ్రెస్ కేటాయించింది. మరో 60 సీట్లలో అభ్యర్థులను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేయనుంది.

ఢిల్లీ: రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ సీఈసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రెండో విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది. తొలి విడతలో 55 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రెండో జాబితాలో ఎంత మంది పేర్లను ప్రకటిస్తుందో వేచి చూడాలి. ఇక నాలుగు సీట్లను వామపక్షాలకు కాంగ్రెస్ కేటాయించింది. మరో 60 సీట్లలో అభ్యర్థులను కాంగ్రెస్ సీఈసీ ఖరారు చేయనుంది.

కొత్తోళ్లకే ప్రాధాన్యత

ఇదిలా ఉంటే తొలి జాబితాలో ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నేతలకు ప్రాధాన్యం లభించింది. మొత్తం 12 సీట్లు వారికి దక్కాయి. మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు, నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన కూచాడి శ్రీహరిరావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఈ నలుగురికీ సీట్లు దక్కాయి. ఇటీవల కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న వినయ్‌ కుమార్‌ రెడ్డి, సునీల్‌ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూసుకుళ్ల రాజే్‌షరెడ్డి, సరిత, ఎ చంద్రశేఖర్‌, వేముల వీరేశం, కోట నీలిమలకు కూడా అభ్యర్థిత్వం లభించింది.

వెయిటింగ్‌లో సీనియర్లు!

ఇక తొలి జాబితాలో సీనియర్లకు మొండిచెయి ఎదురైంది. తొలి జాబితాలో సీటు దక్కని వారిలో సీనియర్‌ నేతలు మధుయాష్కీ, షబ్బీర్‌ అలీ, మహే్‌షకుమార్‌గౌడ్‌, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఉన్నారు. వీరిలో కొందరు తమకు సీటు దక్కుతుందా లేదా అన్న ఆందోళనలోనూ ఉన్నారు. తొలి జాబితాలో వివాదరహిత అభ్యర్థులే అధికంగా ఉన్నారు. తుది జాబితా కూర్పు మాత్రం స్ర్కీనింగ్‌ కమిటీకి సవాలే అంటున్నారు. ఇటు బీసీలు, అటు వివిధ సామాజిక వర్గాల వారు సీట్లలో తమ వాటా తేల్చాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడం కత్తి మీద సాము అయ్యేలా ఉందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-10-24T14:24:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising