ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

V.Hanumanthrao: ‘ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్‌కు మంచి ఊపు వచ్చింది’

ABN, First Publish Date - 2023-05-09T12:24:53+05:30

ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్‌కు మంచి స్పందన వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రియాంక గాంధీ (Priyankagandhi) యూత్ డిక్లరేషన్‌కు మంచి స్పందన వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (Congress senior Leader V hanumanth Rao) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసిఆర్ ఇంటికో ఉద్యోగం అన్నారు ఎక్కడ రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్‌తో మంచి ఊపు వచ్చిందని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ఫ్యామిలీ ఇందిరా గాంధీది అని చెప్పుకొచ్చారు. సొంత పార్టీ నేతలు కొందరు అడ్డుపడ్డా ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. యూత్ డిక్లరేషన్‌ను గ్రామ గ్రామానికి తీసుకెళతామన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ (CM KCR), కేటీఆర్ (Minister KTR) లేరని తెలిపారు. ఆనాడు ఉద్యమం చేసిన చెన్నారెడ్డి, మదన్ మోహన్ వంటి నేతల పేర్లు కేసీఆర్ ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఇంకా బ్లేమ్ చేయడం తగదన్నారు. తెలంగాణ వద్దన్న వారు తమ పార్టీలో కూడా ఉన్నారన్నారు. పార్టీని మెర్జ్ చేస్తేనే తెలంగాణ ఇస్తామని చెప్పకుండా ఆనాడు తాము తప్పు చేశామని వీహెచ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-09T12:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising