Rachakonda Crime Report: 2023 ఇయర్ ఎండింగ్ రాచకొండ క్రైమ్ రిపోర్ట్ ఇదే...
ABN, Publish Date - Dec 27 , 2023 | 12:51 PM
Telangana: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగాయని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రిపోర్టును రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య పెరిగిందన్నారు.
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగాయని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు (Rachakonda CP Sudheer babu) తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రిపోర్టును రాచకొండ సీపీ బుధవారం మీడియాకు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే 6.8% నేరాల సంఖ్య పెరిగిందన్నారు. గతేడాది 27664 కేసులు నమోదు అవగా.. ఈ ఏడాది 29166 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్ కేసులు 25 శాతం పెరిగాయన్నారు. చైన్ స్నాచింగ్, అత్యాచారం, సాధారణ దొంగతనాలు కేసులు తగ్గాయన్నారు. చిన్నారులపై లైంగిక దాడుల కేసులు, హత్యలు, కిడ్నాప్‌లు పెరిగాయన్నారు. అలాగే డ్రగ్స్ కేసులో 12 మందిపై పీడీ యాక్ట్ నమోదు అయ్యిందన్నారు. డ్రగ్స్ 282 కేసుల్లో 698 మంది అరెస్టు అయినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.
మహిళపై నేరాలు 6.65 శాతం తగ్గాయన్నారు. మానవ అక్రమ రవాణా 58 కేసులో 163 మంది అరెస్ట్ అవగా.. ఆరుగురుపై పీడీ యాక్ట్ పెట్టినట్లు చెప్పారు. గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు నమోదు చేయగా వాటిలో 972 మందిని అరెస్ట్ చేశామన్నారుు. ఏడాది నేరాల్లో 5241 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయని చెప్పారు. కన్విక్షన్ రేట్ 62 శాతం పెరిగిందన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందన్నారు. సైబర్ నేరాల్లో 42 మంది అంతరాష్ట్ర, విదేశీ నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. సైబర్ నేరాల్లో నిందితుల బ్యాంక్ ఖాతాలోని 89.92 లక్షలకు నగదును ఫ్రీజ్ చేసి బాధితులకు అప్పగించామన్నారు. ఆపరేషన్ స్మైల్ ద్వారా 64 మంది చిన్నారులను కాపాడామని.. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 136 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించారు. 21 బాల్య వివాహాలు నిలిపివేశామన్నారు. మెట్రో రైల్‌లలో 730 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించామన్నారు. కమిషనరేట్ పరిధిలో 16594 కేసులు నమోదు చేశామని.. 2900 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 3321 ప్రమాదాలు జరగ్గా 633 మంది మృతి చెందారన్నారు. అలాగే 3205 మందికి గాయాలు అయ్యాయన్నారు. గత యేడాదితో పోలిస్తే 16 శాతం రోడ్డు ప్రమాద మరణాలు పెరిగాయన్నారు. యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ద్వారా ఈ ఏడాది 56 కేసుల్లో 153 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. 71 మంది బాధితులకు విముక్తి కలిగించామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన 8758 ఫిర్యాదులో 4643 పరిష్కరించామని సీపీ సుధీర్ బాబు పేర్కొన్నారు.
Updated Date - Dec 27 , 2023 | 12:56 PM