ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Liquor Policy Case: కేసీఆర్ మాట ప్రకారం..ఈడీ విచారణపై కవిత నిర్ణయం ఇది..

ABN, First Publish Date - 2023-03-20T09:13:12+05:30

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi Liquor Policy Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో(Delhi Liquor Policy Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC Kalvakuntla Kavitha)..ఈడీ విచారణకు నేడు హాజరుకానున్నారు. ఈడీ విచారణకు వెళ్లాలని కవితకు సీఎం కేసీఆర్(CM KCR) సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు వెళ్ళడమే మంచిదని మంత్రి కేటీఆర్(KTR) కూడా సూచించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో(Supreme Court) తన పిటిషన్ పై ఈ నెల 24న జరగనున్న విచారణ వరకు వేచి ఉండాలని కవిత భావిస్తోంది. అయితే.. నేడు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలా వద్దా..అనే దానిపై లాయర్లతో కవిత సమావేశం కానుంది. హాజరు కాకపోయినా..విచారణకు సహకరించడం లేదని ED అరెస్ట్ చేసే అవకాశం ఉందని..కొంత మంది న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు కవిత విచారణ హాజరు అవుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈడీ విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న మొదటిసారి ఈడీ విచారణకు హాజరైన కవిత రెండోసారి ఈ నెల 16న గైర్హాజరైన విషయం తెలిసిందే.

కాగా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసుల మేరకు మరోసారి కవిత ఆదివారం రాత్రే ఢిల్లీకి వచ్చారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భర్త అనిల్‌, సోదరుడు, మంత్రి కేటీఆర్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు, పలువురు న్యాయవాదులతో కలిసి కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేరుగా తుగ్లక్‌ రోడ్డులోని తన తండ్రి, సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసంలో ఉన్నారు.

కానీ..నేటితో అరుణ్ రామచంద్ర పిళ్ళై(Arun Ramachandra Pillai) ఈడీ కస్టడీ ముగియనుంది. పిళ్ళైనీ తమ కస్టడీలో మాగంటి శ్రీనివాసులు(Maganti Srinivas), ఎమ్మెల్సీ కవితతో కలిపి విచారించాలని స్పెషల్ కోర్టుకు గతంలో ఈడీ(ED) తెలిపింది. పిళ్ళై ఈ వారం రోజుల కస్టడీ సమయంలో కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఈడీ ముందు హాజరు కాలేదు. ఇవాళ పిళ్ళైని స్పెషల్ సీబీఐ కోర్టులో ఈడీ హాజరు పరుచనుంది.

Updated Date - 2023-03-20T09:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising