ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS High Court: ల్యాండ్ వివాదంలో దర్శకుడు శంకర్‌కు ఊరట

ABN, First Publish Date - 2023-07-07T14:35:32+05:30

భూ కేటాయింపు వివాదంలో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్‌కు భారీ ఉపశమనం లభించింది. భూ వివాదంలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్శకుడు ఎన్.శంకర్‌కు భూమి కేటాయింపును న్యాయస్థానం సమర్థించింది. దర్శకుడికి భూ కేటాయింపుపై దాఖలైన పిల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భూ కేటాయింపు వివాదంలో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్‌కు (Director Shankar ) భారీ ఉపశమనం లభించింది. భూ వివాదంలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దర్శకుడు ఎన్.శంకర్‌కు భూమి కేటాయింపును న్యాయస్థానం సమర్థించింది. దర్శకుడికి భూ కేటాయింపుపై దాఖలైన పిల్‌ను ధర్మాసనం (TS High Court) కొట్టివేసింది.

స్టూడియో నిర్మాణం కోసం 2019లో శంకర్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిళ్ల వద్ద 5 ఎకరాలు భూమిని కేటాయించింది. తక్కువ ధరకు భూమి కేటాయించడంపై జయశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశాడు. అప్పట్నుంచీ కేసు వివాదం కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు దీనికి ముగింపు పలుకుతూ శుక్రవారం దర్శకుడు ఎన్.శంకర్‌కు అనుకూలంగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో దర్శకుడికి బిగ్ రిలీఫ్ దొరికింది.

దర్శకుడు ఎన్.శంకర్ టాలీవుడ్‌లో అనేక చిత్రాలు తీశారు. జై బోలో తెలంగాణ చిత్రానికి శంకర్ నంది అవార్డు అందుకున్నారు. ఆయన దర్శకత్వంలో శ్రీరాములయ్య, జయం మనదే రా, ఆయుధం, భద్రాచలం లాంటి హిట్ చిత్రాలు అందించారు.

Updated Date - 2023-07-07T14:35:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising