Hyderabad: ఉప్పల్ స్టేడియంలో నకిలీ టిక్కెట్ల కలకలం...
ABN, First Publish Date - 2023-04-25T13:22:35+05:30
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో నకిలీ టికెట్లు (Fake Tickets) కలకలం (Kalakalam) రేపుతున్నాయి. సన్ రైజర్స్ (Sunrisers) మ్యాచ్‌లకు ఫేక్ టికెట్స్ ఓ ముఠా విక్రయిస్తోంది.
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం (Uppal Stadium)లో నకిలీ టికెట్లు (Fake Tickets) కలకలం (Kalakalam) రేపుతున్నాయి. సన్ రైజర్స్ (Sunrisers) మ్యాచ్‌లకు ఫేక్ టికెట్స్ ఓ ముఠా విక్రయిస్తోంది. 18న ఉప్పల్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ మ్యాచ్‌లో నకిలీ టికెట్స్ బండారం బయటపడింది. పేటీఎం నుంచి 10 టికెట్స్ కొనుగోలు చేసిన ఓ యువతి.. స్టేడియంకు వెళ్లి చూసేసరికి వేరే వ్యక్తులు ఆ సీట్లలో కూర్చున్నారు. దీంతో ఆ యువతి అవాక్కయింది. వారి వద్ద సేమ్ టికెట్స్ ఉండటంతో అనుమానం వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నిన్న హైదరాబాద్ (Hyderabad)-ఢిల్లీ (Delhi) మ్యాచ్ (Match)లోను నకిలీ టికెట్స్ కలకలం రేపాయి. దీంతో పలువురు బాధితులు, అలాగే నిర్వాహకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఇఫోనీ సంస్థ నుంచి అక్రిడేషన్ పొందిన ఒక వర్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇఫోని సంస్థ నుంచి అక్రిడేషన్ పొందిన వెండర్స్ లోపలకి ఎంటర్ అవుతున్నారు. వెండర్స్‌తో పలువురు స్టేడియం వర్కర్లకు ఇఫోని సంస్థ అక్రిడేషన్లు ఇస్తున్నారు. అక్రిడేషన్ పొందిన ఒక వర్కర్ నకిలీ టికెట్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
Updated Date - 2023-04-25T13:22:35+05:30 IST