ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KA Paul: సెక్రటేరియట్‌లో అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిల్

ABN, First Publish Date - 2023-02-06T15:40:38+05:30

హైదరాబాద్: ఇంకా ప్రారంభంకాని తెలంగాణ (Telangana) నూతన సెక్రటేరియట్‌ (Secretariat)లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టు (High Court)లో పిల్ (Pill) వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఇంకా ప్రారంభంకాని తెలంగాణ (Telangana) నూతన సెక్రటేరియట్‌ (Secretariat)లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టు (High Court)లో పిల్ (Pill) వేశారు. ఈ ఘటనపై సీబీఐ (CBI)తో విచారణ జరపాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పిటిషన్ వేశారు. తాను దాఖలు చేసిన పిల్స్‌ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని చీఫ్ జస్టిస్ బెంచ్‌లో పాల్ మెన్షన్ చేశారు. దీంతో కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌కు నెంబరింగ్ ఇవ్వాలని రిజిస్ట్రార్‌కు ఆదేశించారు. ఈ కేసు రేపు (మంగళవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది.

కాగా ప్రజల డబ్బుతో నిర్మించిన నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ (CM KCR) పుట్టినరోజున ప్రారంభించడం అన్యాయమని.. అంబేడ్కర్‌ (Ambedkar) జయంతి అయిన ఏప్రిల్‌ 14న ప్రారంభించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరారు. జాతి అభివృద్ధి కోసం పౌరులు చెల్లిస్తున్న పన్నుల సొమ్మును దుర్వియోగం చేస్తూ.. అప్పటికే ఉన్న సచివాలయాన్ని వాస్తు పేరిట కూల్చి కొత్తది నిర్మించారని పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.610 కోట్లతో కొత్తగా నిర్మించిన భవనాన్ని తన పుట్టినరోజునాడు ప్రారంభించడం ద్వారా సీఎం వ్యక్తిగత ప్రచారం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల సమయంలో సీఎం కేసీఆర్‌ ఈ నూతన పరిపాలనా భవనాన్ని ఆవిష్కరిస్తారు. ఆయన జన్మదినం రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం. ప్రారంభోత్సవానికి ముందు సీఎం.. వాస్తుపూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర క్రతువులను నిర్వహించనున్నారు. అనంతరం ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నారు.

Updated Date - 2023-02-06T15:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising