ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Fireman Adarsh: నాంపల్లిలో 16 మందిని కాపాడిన హీరో ఇతడే..

ABN, First Publish Date - 2023-11-13T21:51:47+05:30

హైదరాబాద్‌లోని బజార్ ఘాట్‌లో గల హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్‌లో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కెమికల్ గోదాం ఉంది. గోదాం నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని బజార్ ఘాట్‌లో గల హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్‌లో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కెమికల్ గోదాం ఉంది. గోదాం నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. దీంతో అపార్ట్ మెంట్ వాసులు, పలువురు కార్మికులు మంటల్లో చిక్కున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన ప్రదేశానికి హూటాహూటిన వచ్చారు. అయితే ఈ ఘటనపై ఫైర్ మెన్ ఆదర్శ్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 16 మందిని రక్షించినట్లు తెలిపారు. రెండు, మూడు అంతస్తుల్లో ఉన్నవారిని రిస్క్యూ ఆపరేషన్ ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. ఒక చిన్న పాపను కూడా చేతులతో ఎత్తుకొని వెళ్లి హాస్పిటల్‌కి తరలించామన్నారు.

రెండో అంతస్తులో ఉన్న ఆరుగురు పొగపీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లారన్నారు. లోపలికి వెళ్లి చూసేసరికి ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్న వారు గాయాలపాలయ్యారనన్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. తాము లోపలికి వెళ్లే సమయంలో దట్టమైన పొగలు, మంటలు భారీగా అలుముకున్నాయని ఆదర్శ్ ఏబీఎన్‌కు చెప్పాడు.

పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందని అన్నారు. ఆ పొగ పీల్చి అక్కడున్న వారు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వారిని కాపాడాలని ఎంతో ప్రయత్నినప్పటికి.. దురదృష్టశాత్తు వారు మరణించారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిందన్నారు. మరోసారి మంటలు వ్యాపించకుండా లోపల ఉన్న ముడి పదార్థాన్ని బయటకు తరలించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Updated Date - 2023-11-13T22:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising