ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad IT Employees: హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఊరట.. ఎంత గుడ్‌న్యూస్ అంటే..

ABN, First Publish Date - 2023-04-10T09:07:58+05:30

సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు నేటి నుంచి ఎంఎంటీఎస్‌ పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఈ రైలును లాంఛనంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ (Secundrabad to Medchal MMTS) వరకు ఎంఎంటీఎస్‌ పరుగులు పెడుతుండటంతో ఐటీ ఉద్యోగులకు తిప్పలు తప్పాయి. ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Modi) శనివారం ఈ ఎంఎంటీఎస్ రైలును లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ అధికారులు బుకింగ్‌ కోసం ఏర్పాట్లు చేశారు.

బొల్లారం రైల్వేస్టేషన్‌ను (Bollaram Railway Station) ఆధునీకరించారు. సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ రైలు లాలాగూడగేట్‌, మల్కాజిగిరి, దయానంద్‌నగర్‌, సఫిల్‌గూడ, రామకృష్ణాపురం, అమ్ముగూడ, కెవలరీ బ్యారక్స్‌, అల్వాల్‌, బొల్లారం బజార్‌, గుండ్లపోచంపల్లి గౌడవెల్లి స్టేషన్లమీదుగా మేడ్చల్‌ చేరుకోనుంది. ఈ రైలు అందుబాటులోకి రావడం వల్ల ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ప్రయాణం సులభం కానుంది.

ఇప్పటి వరకు మల్కాజిగిరి, దయానంద్‌నగర్‌, సఫిల్‌గూడ, రామకృష్టాపురం ప్రాంతాల ఐటీ ఉద్యోగులు మెట్టుగూడ వెళ్ళి మెట్రో రైలు ద్వారా హైటెక్‌సిటీ లేదా గచ్చిబౌలి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయా ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు, అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌లో హైటెక్‌ సిటీకి చేరుకోవచ్చు. సొంత వాహనంలో అంత దూరం ట్రాఫిక్‌లో ప్రయాణించలేని వారికి ఇది ఉపయుక్తం కానుంది. బొల్లారం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ 15 నిమిషాలకో సారి ఎంఎంటీఎస్‌ అందుబాటులో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

Tirumala: తిరుమల వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే..!

Updated Date - 2023-04-11T06:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising