ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana Budgetకు తొలగిన అవరోధాలు.. గవర్నర్ ఆమోదం

ABN, First Publish Date - 2023-01-31T08:42:38+05:30

తెలంగాణ బడ్జెట్‌కు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. నిజానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయంలో గవర్నర్‌ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిష్కారానికి హైకోర్టు వేదికైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad : తెలంగాణ బడ్జెట్‌కు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. నిజానికి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టే విషయంలో గవర్నర్‌ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిష్కారానికి హైకోర్టు వేదికైంది. రాష్ట్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 3న అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడువు ముంచుకొస్తున్నప్పటికీ బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి గవర్నర్‌ ఆమోదం తెలపలేదని, బడ్జెట్‌కు ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సోమవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

అయితే గడువు సమీపిస్తున్నా బడ్జెట్‌కు గవర్నర్‌ నుంచి ఆమోదం రాకపోవడంతో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపాలంటూ ఈ నెల 21వ తేదీనే గవర్నర్‌కు లేఖ రాసినా ఎలాంటి సమాధానం రాలేదని పేర్కొంది. అయితే ఈ కేసును నిన్న విచారించిన హైకోర్టు చివరకు ఇరువురి మధ్య సయోధ్యను కుదిర్చింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మాట్లాడుకొని రావాలన్న హైకోర్టు సూచనతో గవర్నర్‌ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలించాయి.

బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు గవర్నర్‌ ప్రసంగం ఏర్పాటు చేయడంతో పాటు ప్రసంగం రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గవర్నర్ కార్యాలయ న్యాయవాదులు సైతం బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వానికి గవర్నర్‌ అనుమతి ఇస్తారని తెలిపారు. ఇరువర్గాల మధ్య చర్చలు ఫలప్రదంగా ముగింపునకు వచ్చినందున పిటిషన్‌ను ముగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసులో ఉన్న అంశాలు, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హతపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయడం లేదని.. చర్చలు ఫలప్రదంగా ముగిసినందున పిటిషన్‌లో విచారణ ముగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Updated Date - 2023-01-31T08:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising