ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై

ABN, First Publish Date - 2023-01-25T11:22:57+05:30

కేసీఆర్ ప్రభుత్వ (KCR Govt) తీరుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై (Governor Tamilisai) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వ (KCR Govt) తీరుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై (Governor Tamilisai) తీ

వ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్‌ (Parade Grounds)లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations) నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఘనంగా వేడుకలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే లేని కోవిడ్, పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే జరిపితే వస్తుందా? అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం.

పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో రిపబ్లిక్ డే జరుపుకోక పోవడం, తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయమేనని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. రాజభవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవాలని లేఖ ద్వారా ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనయ్యారు. రాజ్‌భవన్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన తర్వాత సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి అక్కడ రిపబ్లిక్ డే వేడుకలలో తమిళిసై పాల్గొననున్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. గత ఏడాది కూడా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకున్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం వేడుకలను ప్రభుత్వం రాజ్ భవన్‌కే పరిమితం చేసింది.

Updated Date - 2023-01-25T11:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising