ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinashreddy: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

ABN, First Publish Date - 2023-05-26T08:28:52+05:30

హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్‌ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు విచారణ చేయనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ, అవినాష్, సునీత తరఫు న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించనున్నారు.

కాగా సీఎం జగన్‌ చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ వ్యవహారం గురువారం రోజంతా టెన్షన్‌ పెట్టింది. అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు వెలువరించే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చివరికి... విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఇక... అవినాశ్‌ తల్లి చికిత్స పొందుతున్న కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌ చుట్టూ అవినాశ్‌ అనుచరుల హల్‌చల్‌ గురువారం కూడా కొనసాగింది. షిఫ్టులవారీగా ఆస్పత్రి వద్ద బైఠాయిస్తూ హల్‌చల్‌ చేశారు. అక్కడి పరిస్థితులపై ఫొటోలు, వీడియోలు తీయకుండా అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఎవరైనా ఫొటోలు తీస్తున్నట్లు గుర్తిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా దాడులకు తెగబడుతున్నారు. కడప జిల్లా నుంచి వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా కర్నూలుకు తరలిరావడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లే దారిలో ప్రైవేటు ఆస్పత్రులకొచ్చే రోగులు, బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Updated Date - 2023-05-26T09:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising