ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heart Attack: గుండెపోటును ముందే గుర్తించవచ్చా..?

ABN, First Publish Date - 2023-03-09T20:29:19+05:30

ముఖ్యంగా కరోనా (covid) తర్వాత నుంచి గుండెపోటు (heart Attack) తో చాలా మంది అకస్మాత్తుగా చనిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: ముఖ్యంగా కరోనా (covid) తర్వాత నుంచి గుండెపోటు (heart Attack) తో చాలా మంది అకస్మాత్తుగా చనిపోతున్నారు. అప్పటివరకు బాగానే ఉన్నా.. అంతకు ముందు ఎప్పుడూ గుండెపోటు లేకపోయినా ఉన్నట్లు ఉండి ఒక్కసారి గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. వృద్ధులు మాత్రమే కాకుండా.. యువకులు కూడా గుండెపోటుతో మరణించడం తీవ్రంగా కలవరపరుస్తోంది. మరి ఈ గుండెపోటును ముందే గుర్తించవచ్చా.. గుండెకు రక్తప్రసరణ చేసే రక్తనాళాల్లో ఒకదాంట్లో కొవ్వు పెరుకుపోవడంతో గుండె భాగానికి రక్తప్రసరణ జరగకపోవడం వల్ల గుండెపోటు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. గుండెపోటును ముందే గుర్తించవచ్చా అంటే.. నిజానికి గుండెపోటును గుర్తించడమంటే ప్రతిసారి అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో నెట్‌ విప్లవం వచ్చాక.. చాలామంది గంటల కొద్దీ సమయం మొబైల్‌, టీవీ స్ర్కీన్ల ముందే గడిపేస్తున్నారు. అర్ధరాత్రి దాటి.. తెల్లవారుజాము దాకా ఫోన్‌, టీవీ చూస్తూ ఉండిపోతున్నారు. దీనివల్ల హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. మెదడుకు తగిన విశ్రాంతి లభించకపోవడంతో తెలియకుండానే గుండెపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ అలవాట్లు ఉన్నవారు చిన్న వయస్సులోనే హృద్రోగాల బారిన పడే ముప్పు ఉందని, వారు ప్రమాదం అంచున ఉన్నట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పడుకునే వేళలో పనిచేయడం, పనిచేసే సమయాల్లో పడుకోవడం వంటి జీవనశైలి వల్ల గుండె పనితీరు కూడా మారుతోందని.. జీవన చక్రానికి వ్యతిరేకంగా పని సమయాలు ఉండడం వల్ల గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా శరీరం ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటోందని వివరిస్తున్నారు.

టీఎంటీ (ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌), 2డీ ఎకో, లిపిడ్‌ ప్రోఫైల్‌, ఈసీజీ పరీక్షల వల్ల 50 శాతం మేరకు గుండె సమస్యలను ముందే గుర్తించవచ్చు. ధూమపానం, మద్యపానం అలవాట్లున్నవారు, బీపీ బాధితులు..35 ఏళ్ల వయస్సులోనే సీటీ యాంజియోగ్రామ్‌ చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉన్నవారు కూడా ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. అందులో అంతా సజావుగా ఉన్నట్టు తేలితే.. వారికి కనీసం ఏడేళ్ల దాకా హృద్రోగాలు వచ్చే ముప్పు 99 శాతం ఉండదు. పిల్లలకు తల్లిదండ్రులు మంచి జీన్స్‌ ఇవ్వాలి. అందుకు ముందుగా తమ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. రోజూ కనీసం రెండు వేర్వేరు రకాల పండ్లు తినాలి. తప్పనిసరిగా ఒక కప్పు సలాడ్‌ తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారం 15 నిమిషాల్లో తింటే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఆలస్యమైతే పోషకాలు తగ్గిపోతాయి. మాంసాహార, స్పైసీ వంటకాలను మధ్యాహ్నానికి, కొంతమేరకు పరిమితం చేయాలి. రాత్రి పూట చపాతిలతోనే సరిపెట్టాలి. రాత్రిపూట స్పైసీ ఆహారం ఎక్కువగా తీసుకుంటే గుండె నొప్పి వచ్చే ముప్పు ఎక్కువ శాతం ఉంటుంది. కుదిరితే రోజూ నడక, పరుగు, చెమటలు పట్టేలా వ్యాయాయం చేయాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Updated Date - 2023-03-09T21:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising