Group 1 : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై విచారణ.. ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ హైకోర్టు ఫైర్
ABN, First Publish Date - 2023-09-26T13:09:21+05:30
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది.
హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దీనిపై ఎన్నిసార్లు నిర్లక్ష్యం వహిస్తారంటూ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూల్స్ మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్యా? అని హైకోర్టు జడ్జి ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణకు 2.30 కి వాయిదా వేసింది.
Updated Date - 2023-09-26T13:09:21+05:30 IST