ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Highcourt: విసాక ఇండస్ట్రీస్‌కు రూ.17.5కోట్లు చెల్లించాలి.. హెచ్‌సీఏకు హైకోర్టు ఆదేశం

ABN, First Publish Date - 2023-09-29T12:36:48+05:30

విసాక ఇండస్ట్రీస్‌కు ఆరు వారాల్లోపు రూ.17.5 కోట్లు చెల్లించాలని హెచ్‌సీఏకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విసాక ఇండస్ట్రీస్ బ్యాంక్‌లో లోన్

హైదరాబాద్: విసాక ఇండస్ట్రీస్‌కు (Visaka Industries) ఆరు వారాల్లోపు రూ.17.5 కోట్లు చెల్లించాలని హెచ్‌సీఏకు (HCA) తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ఆదేశాలు జారీ చేసింది. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విసాక ఇండస్ట్రీస్ బ్యాంక్‌లో లోన్ తెచ్చి స్పాన్సర్ షిప్ చేసింది. ఆ తరువాత హెచ్‌సీఏ - విసాక ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్‌న‌ు హెచ్‌సీఏ క్యాన్సల్ చేసింది. దీతో విసాక ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లింది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు విసాక ఇండస్ట్రీస్‌కు 18 శాతం యానువల్ ఇంటరెస్ట్‌తో రూ.25 కోట్లు చెల్లించాలని 2016లోనే కోర్టు ఆదేశించింది. అయితే విసాక ఇండస్ట్రీస్‌కు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో హెచ్‌సీఏ ప్రాపర్టీస్‌ను, బ్యాంక్ అకౌంట్స్‌ను 2022 అక్టోబర్‌లో కమర్షియల్ కోర్టు అటాచ్ చేసింది. ఈ క్రమంలో బాంక్ అకౌంట్స్ డీ ఫ్రీజ్ చేయాలని హైకోర్టులో హెచ్‌సీఏ అప్పీల్ చేసింది. ఆరు వారాల్లోగా రూ.17.5 కోట్లు విసాక ఇండస్ట్రీస్‌కు చెల్లించాలని హెచ్‌సీఏ‌కు హైకోర్టు ఆదేశించింది.


విసాక ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణం కోసం హెచ్‌సీఏకు విసాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ షిప్ చేసిందని.. బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని విసాక ఇండస్ట్రీస్ నిధులు ఇచ్చామని తెలిపారు. స్పాన్సర్ షిప్ చేసినందుకు విసాక ఇండస్ట్రీస్‌‌కు కొన్ని రైట్స్ ఇచ్చేలా అగ్రిమెంట్ కూడా చేసుకున్నామన్నారు. అయితే కొన్నిరోజుల తర్వాత హెచ్‌సీఏ అగ్రిమెంట్‌ను క్యాన్సల్ చేసిందన్నారు. దీంతో చట్టప్రకారం కోర్టుకు వెళ్ళినట్లు తెలిపారు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు చట్టప్రకారం రూ.25 కోట్లు.. ప్లస్ సంవత్సరానికి 18 శాతం ఇంటరెస్ట్ పే చేయాలని 2016లో హెచ్‌సీఏ‌కు కోర్టు ఆర్డర్ ఇచ్చిందన్నారు. దీనిపై హెచ్‌సీఏ కమర్షియల్ కోర్టు‌కు అప్పీల్ కి వెళ్లినా.. ఎక్కడా స్టే ఇవ్వలేదని అన్నారు. 2022 అక్టోబర్‌లో హెచ్‌సీఏ ఆస్తులన్నీ అటాచ్ చేస్తూ, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ కమర్షియల్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్‌తో పాటు ఇతర మ్యాచ్‌లు నిర్వహించారన్నారు. బ్యాంక్ అకౌంట్ డీ ఫ్రీజ్ చేయాలని హెచ్‌సీఏ హైకోర్టుకు వెళ్ళిందన్నారు. దీంతో 6 వారాల్లోగా రూ.17.5 కోట్లు తమ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హెచ్‌సీఏ అడ్మినిస్ట్రేటర్‌గా ఉన్న మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు తొందరగా చొరవ తీసుకుని విసాక ఇండస్ట్రీస్‌కు ఇవ్వాల్సిన డబ్బుల మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని వివేక్ వెంకటస్వామి కోరారు.


అడ్వకేట్ ప్రవీణ్ మాట్లాడుతూ.. ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విసాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ షిప్ చేసిందని.. స్పాన్సర్ షిప్ రైట్స్ ఇవ్వకుండా అగ్రిమెంట్‌ను హెచ్‌సీఏ క్యాన్సిల్ చేసిందన్నారు. విసాక ఇండస్ట్రీస్‌తో ఉన్న అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసినందుకు రూ.25 కోట్లు చెల్లించాలని 2016లో కమర్షియల్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఆ డబ్బులు చెల్లించకుండా హెచ్‌సీఏ హైకోర్టు‌కు వచ్చారన్నారు. ఆరు వారాల్లోగా 17.5 కోట్లు విసాక ఇండస్ట్రీస్‌కు చెల్లించాలని హైకోర్టు హెచ్‌సీఏను ఆదేశించిందని అడ్వకేట్ వెల్లడించారు.

Updated Date - 2023-09-29T12:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising