ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Highcourt: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫలితాలపై హైకోర్టు విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-08-03T14:31:59+05:30

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫలితాలపై హైకోర్టు విచారణ వాయిదా పడింది.

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఫలితాలపై హైకోర్టు (Telangana High Court) విచారణ వాయిదా పడింది. ఈనెల 17వ వరకు ఎలాంటి ఫలితాలు విడుదల చేయవద్దని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ధర్మాసనం ఆదేశించింది. జీవో నెంబర్ 57, 58పై అభ్యర్థులు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. జీవో నెంబర్ 57, 58 ప్రకారం మార్కులు తగ్గిస్తున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది. ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి అయిన తరువాత జీవో నెంబర్ 57, 58ను రెక్యూట్ మెంట్ బోర్డ్ తెరపైకి తెచ్చింది. జీవో నెంబర్ 57, 58 ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రకారం కటఫ్ మార్కులను బోర్డ్ నిర్ణయించింది. అయితే నోటిఫికేషన్‌లో ఎక్కడ కూడా జీవో నెంబర్ 57, 58ను పేర్కొనలేదని అభ్యర్థులు వాదించారు. రిజర్వేషన్లపై కటాఫ్ మార్కులు ఉన్నాయని బోర్డ్ వెల్లడించలేదని కోర్టుకు తెలిపారు. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అందరికీ తీవ్ర నష్టం వాటిల్లిందని అభ్యర్థులు పేర్కొన్నారు. పోలీస్ రిక్యూట్ మెంట్ బోర్డ్‌పై ఇప్పటి వరకు హైకోర్టులో 52 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషనర్ అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 17కు వాయిదా వేసింది.

Updated Date - 2023-08-03T14:31:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising