ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mahmood Ali : బజార్‌ఘాట్‌ ఘటన దురదృష్టకరం

ABN, First Publish Date - 2023-11-13T22:20:37+05:30

బజార్‌ఘాట్‌ ఘటన దురదృష్టకరమని హోం మంత్రి మహమూద్‌ అలీ ( Home Minister Mahmood Ali ) అన్నారు

హైదరాబాద్: బజార్‌ఘాట్‌ ఘటన దురదృష్టకరమని హోం మంత్రి మహమూద్‌ అలీ ( Home Minister Mahmood Ali ) అన్నారు. సోమవారం నాడు హైదరాబాద్‌లోని బజార్ ఘాట్‌లో గల హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్‌లో భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ..‘‘ప్రమాదంలో మొత్తం 9మంది చనిపోయారు. ప్రమాదం తర్వాత..సహాయ సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను రక్షించారు. అపార్ట్‌మెంట్‌ ఓనర్ రమేష్ జైస్వాల్‌పై కేసు నమోదు చేశాం. ఘోర అగ్నిప్రమాదానికి రమేష్‌ జైస్వాల్‌ బాధ్యుడు.ప్రస్తుతం రమేష్ జైస్వాల్ హాస్పిటల్‌లో ఉన్నారు. అక్రమంగా రసాయనాలను ఇంటి సెల్లార్‌లో డంప్ చేశారు.ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. క్లూస్‌ టీం కొన్ని ఆధారాలు సేకరించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. 9మంది మృతులకు పోస్ట్‌మార్టం పూర్తైంది’’ అని హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.

Updated Date - 2023-11-13T22:20:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising