ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: ఆ రూట్‌లో ప్రమాదాలకు కారణం ఏంటో తెలిస్తే షాకవుతారు

ABN, First Publish Date - 2023-03-14T15:53:37+05:30

దేవేందర్‌నగర్‌ చౌరస్తా(Devendarnagar Chowrsta) ప్రమాదాలకు నిలయంగా మారుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): దేవేందర్‌నగర్‌ చౌరస్తా(Devendarnagar Chowrsta) ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు లారీలు, టిప్పర్లు, కార్లు, పలు రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటోంది. 60 ఫీట్ల రోడ్డు అందుబాటులో ఉన్నా 30 ఫీట్ల రోడ్డు మాత్రమే వాడుకలో ఉన్నందున ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. గాజులరామారం(Gajula Ramaram) గ్రామ చౌరస్తా, మహదేవపురం చౌరస్తా (Mahadevpur Chowrsta) నుంచి దేవేందర్‌నగర్‌ చౌరస్తా మీదుగా బాచుపల్లి(Bachupally), ప్రగతినగర్‌(Pragathinagar)కు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాలు అధికంగా చౌరస్తా గుండా వెళ్లడంతో రద్దీతో రోడ్డుపై గంటల సమయం వాహనదారులు నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అడ్డదిడ్డంగా వెళ్లే వాహనదారులు అదుపు తప్పి కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు.

ఈ చౌరస్తా మూలమలుపు వద్ద ఓ చిన్న గది ఉండడంతో రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. భారీ వాహనాలు మూల మలుపు వద్ద టర్న్‌ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వెనుక నుంచి వచ్చే వాహనదారులు వేగాన్ని నియంత్రించలేక ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. ఇటీవల కూకట్‌పల్లి(Kukatpally) నుంచి బాచుపల్లి వెళ్తున్న ఓ లారీ చౌరస్తా మూలమలుపు వద్ద ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టడంతో గాయపడ్డాడు. రాత్రి సమయంలో ద్విచక్రవాహనదారులు, కార్లు వేగంగా వెళ్తే పక్కనే ఉన్న గోడను ఢీకొట్టి గాయపడిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. చౌరస్తాలో ట్రాఫిక్‌ నియంత్రణ(Traffic Control)కు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులను ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

చౌరస్తాలో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ అధికంగా ఉంటుంది. ప్రమాదాలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు.

- చెట్ల వెంకటేష్‌, బతుకమ్మబండ

చౌరస్తాను విస్తరించాలి

చౌరస్తాలో సగం రోడ్డే అందుబాటులో ఉండటం వల్ల వాహనదారులు గంటల తరబడి రోడ్డుపై నిలబడాల్సి వస్తోంది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా చౌరస్తాను విస్తరించి ప్రమాదాలు జరగకుండా చూడాలి.

-విఠల్‌, స్థానికుడ

Updated Date - 2023-03-14T15:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising