ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: శాస్త్రిపురం పార్కు కబ్జా

ABN, First Publish Date - 2023-03-31T08:51:41+05:30

ఆ పార్కు చుట్టూ నివాసాలున్నాయి. సమీపంలోనే ఐపీఎస్‌ అధికారులు శిక్షణ పొందే జాతీయ పోలీసు అకాడమీ. కూతవేటు దూరంలో ఓ ఎంపీ నివాసం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

  • ప్రహరీ, గేటు కూల్చివేత

  • ఓ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం

  • అధికారుల ఫిర్యాదుతో వాహనాల సీజ్‌, ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఆ పార్కు చుట్టూ నివాసాలున్నాయి. సమీపంలోనే ఐపీఎస్‌ అధికారులు శిక్షణ పొందే జాతీయ పోలీసు అకాడమీ. కూతవేటు దూరంలో ఓ ఎంపీ నివాసం.. పోలీస్‌స్టేషన్‌. కబ్జాదారులకు అవేమీ పట్టలేదు. గురువారం ఉదయాన్నే మూడు ఎక్సావేటర్లు, పది కార్లు, బొలెరో వాహనాలతో సుమారు 50 మంది రంగంలోకి దిగారు. శాస్త్రిపురం కాలనీలోని 1.30 ఎకరాల విస్తీర్ణంగల పార్కు ప్రహరీ, గేటును కూల్చేశారు. అటువైపు రాకుండా స్థానికులను బెదిరించారు. పోలీసులకు సమాచారం ఉన్నా స్పందించలేదు. జీహెచ్‌ఎంసీ ప్లానింగ్‌ అధికారులు రంగంలోకి దిగాక పోలీసులు కబ్జాదారుల్లో ఇద్దరిని పట్టుకున్నారు. పార్కు ఉన్న ప్రాంతంలో చదరపు గజం స్థలం విలువ రూ.50 వేలకు పైగా పలుకుతోంది. పార్కు స్థలాన్ని కబ్జా చేయాలని వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అనుచరులు గురువారం పక్కాప్లాన్‌తో వచ్చి కబ్జాకు తెగబడినట్లు తెలుస్తోంది.

రాజేంద్రనగర్‌ టౌన్‌ప్లానింగ్‌ ఇన్‌చార్జి ఏసీపీ కృష్ణమోహన్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ కబీర్‌ కూల్చివేతలు జరిపిన ప్రాంతం హుడా పార్కుగా గుర్తించారు. పార్కు ప్రహరీ, గేటును కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలక్‌నుమాకు చెందిన సజ్జద్‌(27), షాలిబండకు చెందిన అసద్‌(25)ను శాస్త్రిపురం పార్కు కబ్జా అరెస్టుచేశారు. మూడు ఎస్కవేటర్లు,కారు, లారీని స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ మధు వెల్లడించారు. వీరి వెనుక సూత్రధారు లెవరనే వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

కారుకు ఎమ్మెల్యే స్టికర్‌

శాస్త్రిపురం కాలనీలో పార్కు స్థలం కూల్చివేస్తున్న పనులను ఓ వ్యక్తి బొలెరో వాహనంలో ఉండి పర్యవేక్షించారు. ఆ కారుకు వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే స్టికర్‌ ఉందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కారు ఎవరిదనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖాళీగా ఉన్న పార్కు స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు తెగబడినట్లు తెలుస్తోంది.

సగం పార్కులు కబ్జా

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో ఇటీవల కాలంలో పార్కు స్థలాల కబ్జాలు పెరిగాయి. ఇప్పటికే కాటేదాన్‌ టీఎన్‌జీవోస్‌ కాలనీలో పార్కు స్థలాలు కబ్జాకు గురయ్యాయి. ఉప్పర్‌పల్లి జనచైతన్య ఫేజ్‌-2లో 22 పార్కులకు గాను సగం కబ్జాకు గురయ్యాయి. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు పార్కులు కబ్జా కు గురికాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-03-31T09:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising