ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: వీపు కింది భాగంలో నొప్పిగా ఉందని ఆస్పత్రికి.. అల్ట్రాస్కానింగ్‌లో కనిపించిన దృశ్యం చూసి..

ABN, First Publish Date - 2023-03-04T13:25:36+05:30

కిడ్నీలో రాళ్లు(kidney Stone) రావడం అనేది ఇప్పుడు సాధారణ విషయమే అయినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మాదాపూర్‌,(ఆంధ్రజ్యోతి): కిడ్నీలో రాళ్లు(kidney Stone) రావడం అనేది ఇప్పుడు సాధారణ విషయమే అయినా.. వెన్నునోప్పితో ఆస్పత్రికి వచ్చిన రైతును పరీక్షించిన డాక్టర్లకు షాకింగ్ న్యూస్ తెలిసింది. 75 ఏళ్ల వయస్సున్న కరీంనగర్(Karimnagar) జిల్లాకు చెందిన రైతు గత కొన్ని నెలలుగా విపరీతమైన బాధపడుతూ చికిత్సకోసం హైటెక్‌సిటీ(Hitech City) ప్రాంతంలో ఏఐఎన్‌యూ(AINU) ఆస్పత్రికి వచ్చారు. అల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌(Ultrasound Scan), సీటీ స్కానింగ్‌ (CT Scan) చేసిన డాక్టర్లు రైతు కిడ్నీలో ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 300 రాళ్లను గుర్తించారు. అయితే రైతు కిడ్నీల్లో వివిధ సైజుల్లో రాళ్లు ఉండటంతో లేజర్, సర్జరీ ద్వారా వాటిని తొలిగించారు.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన 75ఏళ్ల రాంరెడ్డి అనే రైతు గత కొన్నినెలలుగా విపరీతమైన వెన్నునొప్పి, వీపుకిందిభాగంలో నొప్పిగా ఉండడంతో హైటెక్‌సిటీ ప్రాంతంలో ఏఐఎన్‌యూకు వచ్చారు. అల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌, సీటీ స్కానింగ్‌ తీయగా మూత్రపిండంలో ఆయనకు ఏకంగా 7సెంటీమీటర్ల పరిమాణంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దంతో యూరాలజిస్ట్‌ డాక్టర్‌ మహ్మద్‌ తైఫ్‌ బెండిగరి, డాక్టర్‌ మల్లికార్జున నేతృత్వంలో వైద్యబృందం అధునాతన లూజర్‌ టెక్నాలజీని ఉపయోగించి కీహోల్‌ శస్త్రచికిత్సను నిర్వహించారు. కేవలం 5మిల్లీమీటర్ల పరిమాణంలో కోత ద్వారా 7సెంటీమీటర్లకు పైగా ఉన్న రాళ్లను తొలగించారు. ఈ పెద్దరాయి వద్దనే సుమారు 300పైగా చిన్నచిన్న రాళ్లుకూడా ఉన్నాయి. చికిత్స అనంతరం రోగిని పరీక్షించిన వైద్యులు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో రెండోరోజు డిశ్చార్జి చేసినట్లు డాక్టర్‌ తైఫ్‌ తెలిపారు.

అయితే రాంరెడ్డికి చికిత్స చేసిన ఏఐఎన్‌యూ డాక్లర్టు పలు కీలక విషయాలు వెల్లడించారు. సాధారణంగా రోగుల్లో 7 -15 మిల్లీమీటర్ల పరిమాణంలో రాళ్లు కనిపిస్తుంటాయి. రాంరెడ్డి కిడ్నీలో 7 సెంటీమీటర్ల పొడవైన రాయితో పాలు చిన్నచిన్నవి దాదాపు 300 గుర్తించామన్నారు. రోగి వృద్ధాప్యంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఈ చికిత్స‌ను మరింత సంక్లిష్టంగా మార్చాయి. తగిన జాగ్రత్తలు తీసుకుని, అధునాతన లేజర్ టెక్నాలజీని ఉపయోగించి అధునాతన కీహోల్ శస్త్రచికిత్స నిర్వహించామన్నారు.

కోత ద్వారా “కేవలం 5 మిల్లీమీటర్ల పరిమాణంలో 7 సెంటీమీటర్లకు పైగా ఉన్న రాయిని తొలగించారు. ఈ పెద్ద రాయి ద‌గ్గ‌రే 300కు పైగా చిన్న చిన్న రాళ్లు కూడా ఉన్నాయి. సాంకేతికంగా సవాలుతో కూడిన ఈ ప్రక్రియలో, మూత్రపిండాల నుంచి మొత్తం 300కు పైగా రాళ్లను తొలగించామన్నారు. రోగికి ఎలాంటి సమస్యలు లేక‌పోవ‌డంతో, శస్త్రచికిత్స తర్వాత రెండో రోజు డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ తైఫ్ తెలిపారు.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఇప్పుడు సాధార‌ణ‌మే. మొత్తం జ‌నాభాలో 6% - 12% మధ్య ఈ ర‌క‌మైన స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటారు. భారతీయుల్లో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో కిడ్నీల్లో రాళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా, మూత్రపిండాల్లో రాళ్ల వ‌ల్ల న‌డుం కిందిభాగంలో తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. ఇంకా మూత్రంలో మంట లేదా మూత్రంలో రక్తపుచార‌లు క‌నిపించ‌వ‌చ్చు. సాధారణ ప‌రీక్ష‌ల‌తో సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించడానికి, వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలుంటుంది.

మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్న వారు ఈ విధానం గురించి భయపడాల్సిన అవసరం లేదు. సమస్యలను నివారించడానికి వీలైనంత త్వరగా చికిత్స పొందండి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నా, అస‌లు ల‌క్ష‌ణాలేవీ బ‌య‌ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. లేదా చాలా తక్కువ అస్పష్టమైన లక్షణాలు ఉండొచ్చు. అవి మూత్రపిండాలను నిశ్శబ్దంగా దెబ్బతీస్తాయని గమనించాలి. క్రమం తప్పకుండా మూత్రపిండాల వైద్య‌ప‌రీక్ష‌ల‌తో దీన్ని సులభంగా గుర్తించ‌గ‌లం. ఒక‌సారి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే.. మ‌ళ్లీ మ‌రోసారి కూడా ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.

Updated Date - 2023-03-04T13:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!