ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Highcourt: గిరిజన మహిళపై పోలీసుల దాడి.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

ABN, First Publish Date - 2023-08-22T16:21:06+05:30

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళలపై పోలీసులు దాడి చేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది.

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎల్బీనగర్‌లో గిరిజన మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై మంగళవారం హైకోర్టులో (Telangana High court) విచారణ జరిగింది. ఈ ఘటనపై చీఫ్ జస్టిస్‌కి జడ్జి సూరేపల్లి నంద లేఖ రాశారు. ఆ లేఖను పరిగణలోకి తీసుకుని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ డీజీపీ, హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ, రాచకొండ పోలీస్ కమిషనర్‌, ఎల్బీనగర్ డీసీపీకి, ఏసీపీ, ఇన్స్పెక్టర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ కెమెరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన ఎంక్వయిరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.


అసలేం జరిగిందంటే.. మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 4లో ఉంటున్న వరలక్ష్మీ... తన కూతురి పెళ్లి కోసం సరూర్‌నగర్‌లోని బంధువుల ఇంటికి డబ్బులు కోసం వెళ్లారు. ఆగస్టు 15న రాత్రి తిరిగి ఎల్బీనగర్‌కు వస్తుండగా ఎల్బీనగర్ సర్కిల్లో వరలక్ష్మిని పోలీసులు ఆపేశారు. ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. బాధితురాలు ఎదురు తిరిగినందుకు ఖాకీలు మరింత చిత్రహింసలకు గురి చేశారు. ఆపై తెల్లవారుజామున ఓ అధికారి ఆదేశాల మేరకు బాధితురాలిని ఎల్బీనగర్ పోలీసులు వదలిపెట్టారు. పోలీసులు దాడిలో బాధితురాలు నడవలేని స్థితికి చేరుకున్నారు. అకారణంగా పోలీసులు తనని కొట్టారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ పట్ల పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని పలువురు ప్రజాప్రతినిధులు పరామర్శించారు. అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు.


ఇద్దరు పోలీసులపై వేటు...

అలాగే అర్ధరాత్రి మహిళను స్టేషన్‌‌కు తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీకి ప్రయోగించిన కేసులో ఇద్దరు పోలీసులపై వేటు పడింది. మహిళపై దాడికి పాల్పడ్డ హెడ్ కానిస్టేబుల్ శివ శంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ చౌహాన్ ఆదేశించారు. మహిళపై దాడి ఘటనపై విచారణ చేసి నివేదిక తెప్పించుకున్న సీపీ... ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2023-08-22T16:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising