ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Inter Students: ఇంటర్‌లో ఫెయిల్.. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్థులు.. తల్లిదండ్రులకు కడుపుకోత

ABN, First Publish Date - 2023-05-10T09:55:22+05:30

తెలంగాణలో నిన్న ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇలా ఫలితాలు విడుదలయ్యాయో లేదో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో (Telangana) నిన్న ఇంటర్ పరీక్ష ఫలితాలు (Inter Results) విడుదలయ్యాయి. ఇలా ఫలితాలు విడుదలయ్యాయో లేదో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే కారణంగా ప్రాణాలు తీసుకున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ఇంటర్‌ ఫలితాలు ఎలా వచ్చినా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని అధికారులు, మంత్రులు చెప్పిన మాటలు మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఫెయిల్‌ అయినా సప్లిమెంట్ రాసుకోవచ్చన్న ఆలోచన లేకుండా ఫెయిల్ అనే ఒక్కమాటతో జీవితాన్నే వదిలేస్తున్నారు. నిన్న ఇంటర్ ఫలితాలు విడుదలైన కాసేపటికే నిజామాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మాదాపూర్‌లోని ఓ కళాశాలలో బైపీసీ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ప్రజ్వల్ అనే విద్యార్థి నిన్నటి ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన విద్యార్థి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ప్రజ్వల్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.

జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఒకరు, పటాన్‌చెరులో ఇంకొకరు, హైదరాబాద్‌లో చదువుతున్న గద్వాల్ చెందిన మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. సికింద్రాబాద్ నేర్‌డ్‌మెడ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ రేవంత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే హైదరాబాద్‌లో చదువుతున్న ప్రకాశం‌కు చెందిన మరో విద్యార్థిని, ఖైరతాబాద్‌లో గౌతమ్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. కొత్తకోటకు చెందిన మరో విద్యార్థిని మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మణికొండలో విషాదం...

రంగారెడ్డి జిల్లా మణికొండలో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలో ఫెయిల్ అయిందని తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ఐదో అంతస్తు నుండి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శాంతకుమారి మృతిచెందింది. రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో శాంతకుమారి మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇంట్లో ఉరేసుకుని...

అటు సంతోష్ నగర్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సంగెం లక్ష్మీబాయి జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తిచేసిన జాహ్నవి... ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్థాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థిని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఖైరతాబాద్‌లోనూ...

ఇటు ఖైరతాబాద్‌లోని తుమ్మల బస్తీలో ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న వెలువడిన ఇంటర్ రెండవ సంవత్సర ఫలితాలలో ఫెయిల్ కావడంతో గౌతమ్ కుమార్ అనే విద్యార్థి ఇంట్లో ఫ్యాన్‌కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ రెండోవ సంవత్సరం ఒక సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Updated Date - 2023-05-10T10:29:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising