ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: చంద్రబాబు అక్రమ అరెస్టుపై భగ్గుమన్న ఐటీ ఉద్యోగులు

ABN, First Publish Date - 2023-09-13T16:23:40+05:30

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఐటీ ఉద్యోగులు భగ్గుమన్నారు. బాబు అక్రమ అరెస్టును ఐటీ నిపుణులు ఖండించారు. బుధవారం హైదరాబాద్‌లోని విప్రో సర్కిల్ దగ్గర ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుపై ఐటీ ఉద్యోగులు (IT Employees) భగ్గుమన్నారు. బాబు అక్రమ అరెస్టును ఐటీ నిపుణులు ఖండించారు. బుధవారం హైదరాబాద్‌ (Hyderabad)లోని విప్రో సర్కిల్ (Wipro Circle) దగ్గర ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. 'ఐ యామ్ విత్‌ CBN' పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీనికి అనుమతి లేదంటూ పోలీసులు ఐటీ ఉద్యోగులను చెదరగొట్టారు. ‘జై బాబు జైజై బాబు’ అంటూ నినాదాలు చేశారు.

సంక్షోభ సమయంలో చంద్రబాబుకు సంఘీభావం తెలియజేయాలని ఐటీ ఉద్యోగులు పిలుపిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇరికించారని ఐటీ నిపుణులు వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఐటీ ఉద్యోగులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ చంద్రబాబు అంటే ఏంటో ప్రపంచానికే తెలుసునని, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ.. పోలీసులకు కూడా తెలుసునని అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టారంటే.. రాష్ట్రానికి ఏం కర్మ పట్టిందో తెలియడంలేదన్నారు. ప్రజలంతా ఆలోచన చేయాలని ఐటీ ఉద్యోగులు సూచించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, జగన్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2023-09-13T16:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising