ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Golconda: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-06-02T08:52:18+05:30

హైదరాబాద్: కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున గోల్కండ (Golconda) కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున గోల్కండ (Golconda) కోటలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు (Telangana State Inauguration Day Celebrations) ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అమరవీరులను స్మరించుకుందామన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు తమ జీవితాలను పణంగా పెట్టారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగించామన్నారు. అలుపెరగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, కేవలం ఒక్క కుటుంబం, పార్టీ ద్వారానే తెలంగాణ రాలేదని వ్యాఖ్యానించారు. సకలజనులు పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, ఆనాడు బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ వచ్చిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ.. ఒక కుటుంబానికి బానిసగా మారిందని, లిక్కర్‌లో, లీకేజీలో, ప్రాజెక్టుల్లోనూ మాఫియాలే ఉన్నారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారని, అప్పుల కోసమేనా తెలంగాణ సాధించుకుంది? అంటూ కేసీఆర్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని, ఫామ్‌హౌస్‌ల మీద ఫామ్‌హౌస్‌లు పెరుగుతున్నాయని అన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్‌ ఇల్లు మాత్రం రావట్లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.

మతపరమైన రిజర్వేషన్‌లు తొలగిస్తే గిరిజనులకు చట్టపరమైన రిజర్వేషన్‌లు అమలవుతాయని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యమం ద్రోహులకు ప్రభుత్వంలో పెద్దపీట వేశారని, అధికారంలో ఉన్న పార్టీ నేతల కుటుంబాలు బంగారంగా మారాయన్నారు. తెలంగాణలోని సకల రంగాల్లో అవినీతి, అహంకారం, కుటుంబ పాలన, నియంతృత్వం తప్ప మరేదీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లై ఓవర్‌లతో పూర్తి సమస్యలు పరిష్కారం కావని, బస్తీలలో నీటికోసం, డ్రైనేజీ వ్యవస్థ, ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో ప్రజలకు వివరిస్తామన్నారు. దేశంలో ఆదర్శవంతమైన, నీతివంతమైన పాలన అందిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-06-02T08:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising