ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ktr: మళ్లీ ఓట్లేయండి

ABN, First Publish Date - 2023-03-08T02:00:46+05:30

రాబోయే ఎన్నికలకు ముందు నేను హాజరవుతున్న చివరి సీఐఐ వార్షిక సమావేశమిది. కాబట్టి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా ఓట్లు వేయండి. 2023లో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చేయండి’’ అని పారిశ్రామికవేత్తలను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తెలంగాణ ఇతోధికంగా పురోగమిస్తోంది

2014లో తలసరి ఆదాయం 1.24 లక్షలు

ఇప్పుడు అది రూ.3.17 లక్షలకు చేరుకుంది

8 ఏళ్లలో రాష్ట్రంలో 55 పారిశ్రామిక పార్కులు

ఫార్మా సిటీ ఏర్పాటుకు కేంద్రం మద్దతు లేదు

విభజన చట్టంలోని పారిశ్రామిక కారిడార్ల

ఊసు లేదు.. ప్రత్యేక ప్రోత్సాహకాలూ లేవు

చట్టంలో ఉన్నవాటినే కేంద్రం ఇవ్వట్లే: కేటీఆర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌), మార్చి 7: ‘‘రాబోయే ఎన్నికలకు ముందు నేను హాజరవుతున్న చివరి సీఐఐ వార్షిక సమావేశమిది. కాబట్టి, మమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా ఓట్లు వేయండి. 2023లో మేమే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చేయండి’’ అని పారిశ్రామికవేత్తలను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కోరారు. మంగళవారం ఇక్కడ మొదలైన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ వార్షిక సమావేశంలో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. తెలంగాణ పారిశ్రామిక అవార్డులు, సీఐఐ హరితహారం అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ‘మిమ్మల్ని ఓట్లు కోరడం నా బాధ్యత’ అంటూ తమను మళ్లీ అధికారంలోకి తేవాలని విజ్ఞప్తి చేయగానే అక్కడున్న పారిశ్రామికవేత్తలంతా చప్పట్లు కొట్టారు. దీనికి కేటీఆర్‌.. ‘మీ నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మేం మళ్లీ అధికారంలోకి వస్తామనే అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

అనంతరం తన ప్రసంగంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని.. ఒక దేశంగా అన్ని రాష్ట్రాలూ పురోగమించాలని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాలు తమ శక్తి సామర్థ్యాలను వినియోగించుకోవాలంటే.. అందుకు కేంద్ర ప్రభుత్వం అండకూడా ఉండాలి. బాగున్న రాష్ట్రాలను ప్రోత్సహించాలి. బాగోలేని రాష్ట్రాలకు అండగా నిలవాలి. మేకిన్‌ ఇండియా.. ఆచరణలోనే కనిపించడం లేదు’’ అని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై పారిశ్రామికవేత్తలే కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ బాగా పురోగమిస్తోందని.. 2014లో రూ.1.24 లక్షలుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పుడు రూ.3.17 లక్షలకు చేరిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. స్థూల రాష్ట్ర ఉత్పత్తి సైతం రూ.5.6 లక్షల కోట్ల నుంచి రూ.13.27 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ హైదరాబాద్‌లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తుంటే.. కేంద్రం మద్దతు లేదని, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకూ మద్దతు లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. విభజన చట్టం కింద ఏర్పాటు చేయాల్సిన ఇండస్ట్రియల్‌ క్యారిడార్ల ఊసు లేదని.. ప్రత్యేక ప్రోత్సాహకాలు లేవని.. చట్టంలో ఉన్నవాటినేకేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. కేటీఆర్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

హైదరాబాద్‌.. ‘ఎకనమిక్‌ ఇంజిన్‌’

భారత్‌కు హైదరాబాద్‌ లాంటి ‘ఎకనమిక్‌ ఇంజిన్లు’ కావాలి. దేశ వ్యాప్తంగానే కాక ప్రపంచస్థాయి నిపుణులను తెలంగాణ ఆకర్షించగలుగుతోంది. దీన్ని కొనసాగిస్తాం. నాలుగో తరం పారిశ్రామిక విప్లవం తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తోంది. నాలెడ్జ్‌ ఎకానమీగా రాష్ట్రం ఎదుగుతోంది. గత ఎనిమిదేళ్లలో 28,500 ఎకరాల్లో 55 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేశాం. వచ్చే అయిదేళ్లలో 30,000 ఎకరాల్లో 72 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నాం. ఇవి అభివృద్ధి దశలో ఉన్నాయి. పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఉపాధి అవకాశాల కల్పనే. ఇక.. అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (యూఎ్‌సఎ్‌ఫడీఏ) ఆమోదం పొందిన ఔషధ తయారీ యూనిట్లు ప్రపంచంలోనే అత్యధికంగా హైదరాబాద్‌, తెలంగాణల్లో ఉన్నాయి. భారత్‌ బయో, బయోలాజికల్‌-ఈ వంటి కంపెనీల విస్తరణ, సీరమ్‌, సనోఫి వంటి కంపెనీలు హైదరాబాద్‌లోకి అడుగు పెట్టడం ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 14 బిలియన్‌ డోసుల టీకాలను తయారు చేయనున్నాయి. ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, రక్షణ, ఏరోస్పేస్‌, పర్యావరణ అనుకూల మొబిలిటీ వంటి అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా పురోగతి సాధిస్తోంది. ఫార్మా సిటీ చివరి దశకు వచ్చింది. ఐటీ రంగంలో 10 లక్షల మందికి పైగా నిపుణులు పని చేస్తున్నారు. లైఫ్‌ సైన్సెస్‌ 4.5లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలోనూ గ్రీన్‌, బ్లూ, పింక్‌, వైట్‌, యల్లో విప్లవాలతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచనున్నాం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, చిన్న క్లస్టర్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

‘ఇండియన్‌ బిజినెస్‌’ పోర్టల్‌ ప్రారంభం

తెలంగాణ వ్యాపారాల కోసం ‘ఇండియన్‌ బిజినెస్‌’ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ పోర్టల్‌.. ఎగుమతులను ప్రోత్సహించడానికి ఉద్దేశించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో స్థానిక విక్రయదారులను అనుసంధానం చేయడానికి ఇది ఒక ప్లాట్‌ఫామ్‌గా పని చేస్తుంది. రాష్ట్రంలో భౌగోళిక సూచీ (జీఐ) గుర్తింపు కలిగిన ఉత్పత్తుల ఎగుమతులకు కృషి చేస్తుంది.

Updated Date - 2023-03-08T02:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising