Janasena BJP: జనసేన-బీజేపీ పొత్తుపై తాజా అప్‌డేట్ ఇదే!
ABN, First Publish Date - 2023-10-21T12:49:16+05:30
ఢిల్లీ బీజేపీ పెద్దల మేధోమథనం తర్వాత జనసేనతో కలిసి వెళ్లాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను
హైదరాబాద్: ఢిల్లీ బీజేపీ పెద్దల మేధోమథనం తర్వాత జనసేనతో కలిసి వెళ్లాలని హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. జనసేనానితో చర్చించిన అంశాలను రాష్ట్ర బీజేపీ నేతలు... అధిష్టానానికి తెలియజేశారు. హస్తినలో సుదీర్ఘ చర్చ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. జనసేనతో పొత్తు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని రాష్ట్ర బీజేపీ కూడా కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో జనసేనకు 7 నుంచి 10 సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ఈ రెండు పార్టీలు కలిసి వెళ్లేదో.. లేదో రేపుగానీ.. ఎల్లుండిగానీ ఓ క్లారిటీ వచ్చే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. ఏ సమయంలోనైనా తొలి జాబితాను బీజేపీ ప్రకటించనుంది. ఈ జాబితాలో బీసీలకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2023-10-21T13:17:08+05:30 IST