ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gandhi Death anniversary: గాంధీజీకి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ నివాళులు

ABN, First Publish Date - 2023-01-30T11:43:07+05:30

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి (Mahatma Gandhi Death Anniversary) సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy), మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Telangana Legislative Council Chairman Gutta Sukhender Reddy), నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ... ప్రపంచ శాంతి దూత, దేశ స్వాతంత్ర్య పోరాట యోధుడు మహత్మ గాంధీ... ఆయనకు ఘనంగా నివాళులు అని అన్నారు. ఈ సృష్టి ఉన్నన్ని రోజులు గాంధీజీనీ మర్చిపోరని తెలిపారు. బ్రిటిష్ వాళ్లను భారత్ నుంచి పంపి దేశానికి శాంతి సామరస్యంతో స్వాతంత్ర్యం తెచ్చి పెట్టారన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర వేడుకను గాంధీజీ అనుభవించలేదని అన్నారు. ఆయన్ని స్మరించుకోవడం కాదు.. ఆయన మార్గంలో పయనించాలని స్పీకర్ సూచించారు.

ఈ స్వతంత్రం అందరి హక్కు అని అన్నారు. మనది సంపన్న దేశమని, అన్ని వనరులు ఉన్నాయ తెలిపారు. గాంధీజీని హత్య చేసింది, చేయించింది ఎవరు అనేది భగవంతుడు చేస్తారన్నారు. రాష్ట్ర దేశ నాయకులు పునరంకితం కావాలని తెలిపారు. గ్రామ స్వరాజ్యం చేసింది కేవలం ఒక్క కేసీఆరే అని అన్నారు. గ్రామాల్లో కుల వృత్తుల పనులు గ్రామ స్వరాజ్యంతో సాకారం అవుతుందన్నారు. మిగితా రాష్ట్రాలు కూడా తెలంగాణను అనుసరిస్తోందని చెప్పుకొచ్చారు. కేంద్రం కొన్ని విషయాలు వ్యతిరేకిస్తున్నా వాస్తవాలు దాచుకోలేకపోతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

మండలి ఛైర్మెన్ గుత్తా మాట్లాడుతూ... ఇప్పుడున్న పరిస్థితుల వల్ల రాజ్యాంగానికి ఆటంకాలు కలుగుతున్నాయన్నారు. దేశంలో ఉన్న ఫెడరల్ వ్యవస్థ లౌకిక విధానం కాపాడుకోవాలని తెలిపారు. వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని కొందరు దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలని హితవుపలికారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్ ఎవరైనా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే దోరణి ఉండాలన్నారు. బడ్జెట్ ఆమోదంపై అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-01-30T11:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising