PM MODI: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ABN, First Publish Date - 2023-10-03T16:41:12+05:30
తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) వ్యాఖ్యానించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
నిజామాబాద్: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) వ్యాఖ్యానించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన జనగర్జన సభలో మోదీ ప్రసంగిస్తున్నారు. తెలంగాణలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆస్పత్రులు, రైల్వేలైన్లు నిర్మిస్తున్నాం. NTPCతో రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.NTPC పవర్ ప్లాంట్‌తో తెలంగాణలో ఎంతో మార్పు రానుంది. పెద్దపల్లి NTPC పవర్ ప్లాంట్‌ను శరవేగంగా పూర్తిచేశాం.NTPC ప్లాంట్ నుంచి తయారయ్యే విద్యుత్‌లో.. అధిక భాగం తెలంగాణకే కేటాయిస్తాం. NTPC ప్లాంట్ శంకుస్థాపన చేసింది నేనే.. ప్రారంభించింది నేనే.మా గ్యారంటీలకు ఇదే నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు.
ఇది మా వర్క్ కల్చర్
తెలంగాణకు అండగా ఉంటాం. ఇక్కడి ప్రజల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. బీజేపీ ప్రభుత్వం(BJP Govt) శంకుస్థాపనలే కాదు.. ఆ పనులను కూడా సకాలంలో పూర్తి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM MODI) తెలిపారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు మేము కృషి చేస్తున్నాం. త్వరలో భారతీయ రైల్వే 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ అవుతుంది. ఇది మా వర్క్ కల్చర్ అని చెప్పారు. బీబీ నగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనం పనులు చాలా తొందరగా పూర్తవుతున్నాయని.. ప్రజలంతా మేము చేసిన పనులను చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం
నేడు తెలంగాణ(Telangana)లోని నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేశారు. మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్, సిద్దిపేట-సికింద్రాబాద్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు.
Updated Date - 2023-10-03T17:18:37+05:30 IST