Balmoori Venkat: ‘టీఎస్‌పీఎస్సీ లీకేజీలో ఇద్దరే నిందితులని కేటీఆర్ ఎలా చెబుతారు?’
ABN, First Publish Date - 2023-03-21T15:05:04+05:30
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణను హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్ (TSPSC Paper Leakage) కేసు విచారణను హైకోర్టు (Telangana High Court) ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ (NSUI leader Balmuri Venkat) మీడియాతో మాట్లాడుతూ... 30 లక్షల మంది విద్యార్థుల జీవితం కోసం న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు మాత్రమే నిందితులను మంత్రి ఎలా చెపుతారని ప్రశ్నించారు. న్యాయష్టానం మీద తమకు నమ్మకం ఉందన్నారు. ‘‘నేను ఒక విద్యార్థి సంఘం నాయకుడిని కాబట్టి పిటిషన్ వేశా. నాతో పాటు పిటిషన్ వేసిన అభ్యర్థుల హల్ టికెట్స్ కూడా కోర్టుకు సమర్పించాము. పిటిషన్ వేసే అర్హత లేదని ఏజీ చెప్పడంలో అర్ధం లేదు. న్యాయ స్థానం పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది’’ అని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు.
మరోవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage) విచారణను హైకోర్టు (Telangana High Court) ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ వివరాలు కోర్టుకు సమర్పించాల్సిందిగా ఏజీని కోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి పాత్రపై విచారణ చేపట్టాలంటూ ఎన్‌ఎస్‌యూఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా (Supreme Court Senior Counsel Vivek Tanka) వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ (AG BS Prasad) వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది.
Updated Date - 2023-03-21T15:06:38+05:30 IST