Osmania University : మరో పోరాటానికి సిద్ధమైన ఓయూ.. క్యాంపస్‌లో హై అలర్ట్
ABN, First Publish Date - 2023-03-24T09:07:07+05:30
ఉస్మానియా యూనివర్సిటీ మరో పోరాటానికి సిద్ధమైంది. దీంతో పోలీసులు నేడు, రేపు క్యాంపస్‌లో హై అలర్ట్ ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad : ఉస్మానియా యూనివర్సిటీ మరో పోరాటానికి సిద్ధమైంది. దీంతో పోలీసులు నేడు, రేపు క్యాంపస్‌లో హై అలర్ట్ ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకి విద్యార్థులు ప్లాన్ చేశారు. దీక్షకి పర్మిషన్ లేదని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీక్ష చేస్తే కేసులు తప్పవని ఓయూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే.. దీక్ష చేసి తీరుతామని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.
క్యాంపస్‌లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం హెచ్చరిస్తోంది. ప్రతిపక్ష నాయకుల రాకను విప్లవ వామపక్ష విద్యార్థి సంఘాలు స్వాగతిస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జ్యూడిషియల్ విచారణకి విద్యార్థులు పట్టుబడుతున్నారు. విద్యార్థులను ముందస్తుగా ఓయూ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ముందస్తు అరెస్ట్‌లపై కొందరు ఓయూ విద్యార్థులు భగ్గుమంటున్నాయి. క్యాంపస్‌కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసేశారు.
Updated Date - 2023-03-24T09:07:07+05:30 IST