Nathuram Godse Photo: శోభాయాత్రలో నాథూరామ్ గాడ్సే ఫొటో కలకలం
ABN, First Publish Date - 2023-03-30T22:27:03+05:30
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) నిర్వహిచిన శోభాయాత్ర(Shobhayatra) లో మహాత్మా గాంధీ(Mahatma Gandhi)ని చంపిన నాథూరామ్ గాడ్సే ఫొటో (Nathuram Godse Photo) దర్శనం ఇవ్వడం కలకలం రేపింది.
హైదరాబాద్(Hyderabad): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) నిర్వహిచిన శోభాయాత్ర(Shobhayatra) లో మహాత్మా గాంధీ(Mahatma Gandhi)ని చంపిన నాథూరామ్ గాడ్సే ఫొటో (Nathuram Godse Photo) దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. దూల్‌పేట్(Dhulpet)లోని ఆకాష్ పూరి హనుమాన్ మందిర్(Akash Puri Hanuman Mandir)లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాజాసింగ్ ఈ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున యువకులు, భక్తులు పాల్గొన్నారు. అయితే ర్యాలీలో రాజాసింగ్ వాహనంపై ఉండగా కింద ఉన్న యువకులు ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ క్రమంలో జైశ్రీరామ్(ji Sriram) అనే జెండాలతో పాటు జాతిపిత మహాత్మాగాంధీని హతమార్చిన నాథూరామ్ గాడ్సే ఫొటోను ప్రదర్శించారు. దీంతో ఈ ర్యాలీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకుంటారా అనేది ఉత్కంఠ రేపుతోంది.
Updated Date - 2023-03-30T22:29:48+05:30 IST