ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Highcourt: దళితబంధు స్కీంపై హైకోర్టులో పిల్.. తెలంగాణ సర్కార్‌కు నోటీసులు

ABN, First Publish Date - 2023-08-30T13:43:53+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్మాత్మకంగా రూపొందించి దళితబంధు స్కీంపై హైకోర్టులో పిల్ దాఖలైంది.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్మాత్మకంగా రూపొందించి దళితబంధు స్కీంపై (Dalitabandhu Scheme) హైకోర్టులో(Telangana Highcourt) పిల్ దాఖలైంది. దళితబంధు స్కీమ్‌లో ఎమ్మెల్యేలు, అధికారుల ప్రమేయం, సిఫార్సులు ఉండకూడదని పిల్ దాఖలైంది. ఎమ్మెల్యేలు, అధికారుల సిఫార్సు మేరకు దళితబంధు అర్హులను సెలెక్ట్ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల సందర్భంగా దళితబంధు అర్హులను ప్రస్తుతం ఎంపిక చేస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ లిస్ట్‌లో ఎమ్మెల్యేల అనుచరులకే ఈ పథకం వర్తింపజేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ‌ను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-08-30T13:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising